సిగ్గుపడాల్సింది పోయి బెదిరిస్తున్నారు: విజయసాయి ఫైర్

Published : Jun 20, 2020, 05:03 PM IST
సిగ్గుపడాల్సింది పోయి బెదిరిస్తున్నారు: విజయసాయి ఫైర్

సారాంశం

రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు.

రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు. మండలిలో జరిగిన సంఘటనలను వీడియోలు తీసి సభ మర్యాదుల ఉల్లంఘనలకు పాల్పడ్డ లోకేష్ సభ మర్యాధనలను ఉల్లంఘించాడని, అటువంటి లోకేష్ విప్లవ యోధుడిలా కనబడుతున్నాడా అంటూ ఎద్దేవా చేసారు. 

"సమాంతర పాలన భ్రాంతిలో బాబు గారు మునిగి తేలుతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును కౌన్సిల్ లో అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందారు. ఇలాంటి ఉపశమనాలతో బండి లాక్కొస్తున్నారు. వీడియోలు తీసి సభా మర్యాదలు ఉల్లంఘించిన కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు. ప్రజలు ఛీ కొడుతున్నా!" అని రాసుకొచ్చారు. 

ఇక మరోట్వీట్లో... అవినీతి కేసుల్లో టీడీపీ నేతలు చిక్కుకుంటే... సిగ్గుపడాల్సిందిపోయి మానవహక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని అంటున్నాడని ఎద్దేవా చేసారు.

"తమ పార్టీ నేతలు వందల కోట్ల కుంభకోణాలు, ఫోర్జరీ, మోసం కేసుల్లో అరెస్టయితే సిగ్గు పడాల్సింది పోయి, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు నాయుడు బాబు. స్వార్థ బుద్ధితో నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న వారికి హక్కుల భంగం ఎలా కలిగిందో ప్రజలకు జవాబు చెప్పాలి." అని పోస్ట్ చేసారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu