కేసీఆర్ బాటలోనే జగన్: 10వ తరగతి పరీక్షల రద్దు

By Sreeharsha GopaganiFirst Published Jun 20, 2020, 3:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో అంతకంతకు కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతుండడంతో...  పదవ తరగతి పరీక్షలను రద్దు చేసే యోచనలో  ఉంది ఏపీ సర్కార్. ఇప్పటికే... తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలియవస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ లో అంతకంతకు కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతుండడంతో...  పదవ తరగతి పరీక్షలను రద్దు చేసే యోచనలో  ఉంది ఏపీ సర్కార్. ఇప్పటికే... తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలియవస్తుంది. 

ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా టెన్త్‌ పరీక్షలు రద్దు చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకున్నాయని, సాయంత్రానికి పరీక్షలపై క్లారిటీ రానుందని, 5 గంటలకు మంత్రి ఆదిమూలపు  సురేష్ టెన్త్ పరీక్షల రద్దు పై అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది. 

ఏపీలో కరోనా కేసులు రోజుకు దాదాపుగా 500లకుపైగా నమోదవుతున్న నేపథ్యంలో  తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష  టీడీపీ, జనసేనతో పాటు ప్రజాసంఘాలు కూడా పదవ తరగతి పరీక్షలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 

ఇకపోతే... భారత్ లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మృతి చెందారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభణ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

గత 24 గంటల్లో 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,95,048 కు పెరిగింది. అలాగే కొత్తగా 375 మంది కరోనాతో మరణించగా మొత్తం మరణాల సంఖ్య 12,948 కు చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతుండగా 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అప్పటికే ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో మన భారత్ 4 వ స్థానంలో ఉండటం గమనార్హం.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ భారీగానే ఉంది. రోజుకి దాదాపు 500కేసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతుండటం గమనార్హం. ఇప్పటికే తెలంగాణలో 6వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా... ఆంధ్రప్రదేశ్ లో 7వేలు దాటేసింది. దాదాపు 8వేలకు చేరువలో ఉంది. 

click me!