
టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) , ఆయన తనయుడు నారా లోకేష్‌పై (nara lokesh) వైసీపీ (ysrcp) ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు.
‘‘లోకేశ్ బరితెగింపు చూస్తుంటే...MLC పదవీకాలం గడువు దగ్గర పడుతోంది. తర్వాత ఏ పదవి దక్కేది లేదు. అందుకే తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడు. అమరావతి పేరుతో లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక, అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడు పప్పు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ‘‘రంగా హంతకులకు వైజాగ్‌ను కానుకగా రాసిచ్చి భూదందాలకు, మద్యం సిండికేట్లకు లైసెన్సిచ్చిందే చంద్రబాబు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రకటనకు ముందే వేల ఎకరాల భూములను కొనిపించింది ఎవరు? ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను ఏదో జరుగుతోందంటూ బెదరగొడుతున్నారు తండ్రీ, కొడుకులు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విషయంలోనూ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘‘ అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎన్టీఆర్‌ను జనం జ్ఞాపకాల నుంచి తుడిచేసేందుకు ప్రయత్నించాడు చంద్రబాబు. సీఎం జగన్ గారు ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో తెగ కుమిలిపోతున్నాడు. ఆ గింజుడు చూసి మిగిలిన కులనాయకులు కూడా బాబును వదిలి పోతారు. సొల్లు తప్ప బాబులో మేటర్ లేదని అందరికీ అర్థమైంది’’ అంటూ ఎద్దేవా చేశారు.