ఇప్పటికీ ప్రాసెస్ కానీ జీతాల బిల్లులు.. వారికి బాధ్యతలు, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Siva Kodati |  
Published : Jan 30, 2022, 08:40 PM ISTUpdated : Jan 30, 2022, 08:44 PM IST
ఇప్పటికీ ప్రాసెస్ కానీ జీతాల బిల్లులు.. వారికి బాధ్యతలు, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

సారాంశం

ఇప్పటికీ ప్రాసెస్ కానీ జీతాలు, పెన్షన్ల బిల్లుల బాధ్యతలను డీడీవోల కంటే పైస్థాయి అధికారులకు అప్పగించింది ప్రభుత్వం. ఈ మేరకు వివిధ జిల్లాల కలెక్టర్లు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జీతాల బిల్లులు ప్రాసెస్ కాకుంటే ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలు (Govt employees) - ప్రభుత్వానికి (ap govt) మధ్య పీఆర్సీ వార్ (prc) నడుస్తోన్న సంగతి తెలిసిందే. పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం.. పాత జీతాలే కావాలని ఉద్యోగులు పట్టుబట్టడంతో వ్యవహారం వేడి మీదుంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు దిగనున్నాయి. అయితే 1వ తారీఖు సమీపిస్తుండటంతో జీతాల (salaries) వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. పరిస్ధితులు చూస్తుంటే.. ఫిబ్రవరి ఒకటో తారీఖున ఉద్యోగుల అకౌంట్లలలో జనవరి నెల జీతాలు పడటం అనుమానంగానే కనిపిస్తోంది.

జీతాలు ప్రాసెస్ చేయాల్సిందే అని ప్రభుత్వం.. మీరేం చేసినా ప్రాసెస్ చేసేది లేదంటూ ట్రెజరీ ఉద్యోగులు పంతానికి పోవడంతో వేతనాల విడుదలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలన్న విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం వరుస పెట్టి సర్క్యూలర్స్‌ జారీ చేస్తూనే ఉంది. తాజాగా… వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయకుండా మొండికేస్తున్న అధికారులపై చర్యలు తీసుకొనేందుకు ఆర్ధిక శాఖ (ap finance department) సిద్ధమైంది. దీనిలో భాగంగా జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన డీడీఓలు, ట్రెజరీ అధికారులపై క్రమశిక్షణా చర్యల కోసం శనివారం మెమోలు జారీ చేసింది. 

2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకూ తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ట్రెజరీస్ డైరెక్టర్ కు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచిస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ హెచ్చరికలతో ఇవాళ ఆదివారమైనప్పటికీ ట్రెజరీ ఉద్యోగులు విధులకు హాజరై జీతాలను ప్రాసెస్ చేసే పనిలో పడ్డారు. 

అయితే ఇప్పటికీ ప్రాసెస్ కానీ జీతాలు, పెన్షన్ల బిల్లుల బాధ్యతలను డీడీవోల కంటే పైస్థాయి అధికారులకు అప్పగించింది ప్రభుత్వం. ఈ మేరకు వివిధ జిల్లాల కలెక్టర్లు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జీతాల బిల్లులు ప్రాసెస్ కాకుంటే ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. సర్వీస్ రిజిస్ట్రార్ అందుబాటులో లేని కారణంగా జీతాల బిల్లుల చెల్లింపులు చేయలేమని అశక్తతను వ్యక్తం చేస్తూ.. కొన్ని జిల్లాల్లో ట్రెజరీ అధికారులకు లేఖలు రాశారు ఉన్నతాధికారులు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దంటూ ఉద్యోగులు రిక్వెస్ట్ పెట్టారని అధికారులు లేఖల్లో స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ఆదివారం బిల్లులను ప్రాసెస్ చేశారు ఉద్యోగులు.. ప్రాసెస్ కానీ బిల్లుల విషయంలో అధికారాలను బదలాయిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్