ఏపీలో టెన్త్ పేపర్ల లీకేజీ ఘటనలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎందుకు ఎగిరి పడుతున్నావని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
అమరావతి: ఏపీలో టెన్త్ పేపర్ల లీకేజీ ఘటనలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఎగిరెగిరిపడుతున్నావని వైసీపీ ఎంపీ Vijayasai Reddy ప్రశ్నించారు.
ఏపీ రాష్ట్రంలో టెన్త్ ప్రశ్నపత్రం leakage ఘటనకు సంబంధించి ఏపీకి చెందిన మాజీ మంత్రి Narayana ను Chittoor పోలీసులు మంగళవారం నాడు Hyderabad లో అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు ఉదయం హైద్రాబాద్ నుండి చిత్తూరుకు తరలించారు. ఇవాళ తెల్లవారుజామున మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
ర్యాంకుల కోసం రేయింబవళ్లు నారాయణ యాజమాన్యం పెట్టే వత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్ధులు, వారి తల్లితండ్రుల ఆక్రందనలు నీకు వినబడలేదా బాబూ? అందుకేనా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను మంత్రిని చేసింది?
2/2
ఈ విషయమై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ర్యాంకుల కోసం రేయింబవళ్లు నారాయణ యాజమాన్యం పెట్టే ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల ఆక్రందనలు నీకు వినబడలేదా బాబు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అందుకేనా నారాయణకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసింది అని ఆయన ప్రశ్నించారు.
SSC పేపర్ల లీకును సేవగా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏమిటీ Chandrababu అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. నీ అండతోనే అతి పెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను నారాయణ సృష్టించారన్నారు. లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావని ప్రశ్నించారు.
పేపర్ల లీకును ‘సేవ’గా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ? నీ అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించి లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు?
1/2
గత మాసంలో ఏపీ రాష్ట్రంలో జరిగిన టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి.గత ఏడాది ఏప్రిల్ 27న ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రం బయటకు వచ్చింది. వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది.ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయనను అరెస్టు చేశారు. నారాయణ విద్యా సంస్థలకు చెందిన గంగాధర్ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. గంగాధర్ తో పాటు మరో ఇద్దరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూప్ లో చక్కర్లు కొట్టడంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్టణ స్టేషన్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
టెెన్త్ క్లాస్ పేపర్ల లీకేజీ అంశానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. కక్షపూరిత చర్యల్లో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు విమర్శించారు.