ఇంకెంత దిగజారుతావు గుడ్డి విజనరీ...: చంద్రబాబుపై విజయసాయి సంచలనం

By Arun Kumar PFirst Published Jul 7, 2020, 10:59 AM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు తన రాజకీయాల కోసం ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్దికి అడ్డుపడుతున్నారని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు తన రాజకీయాల కోసం ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్దికి అడ్డుపడుతున్నారని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే దిగజారుడు రాజకీయాలు చేస్తున్న ఆయన ఇంకెంత దిగజారుతారో అంటూ మండిపడ్డారు. ఇలా సోషల్ మీడియా వేదికన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. 

''జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ? 2024లో నీ అడ్రస్ గల్లంతే'' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.  

read more  పెను ప్రమాదంలో బిజెపి... గ్రహించే లోపే విధ్వంసం: విజయసాయి రెడ్డి

అలాగే కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీపై ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పై కూడా  విజయసాయి సెటైర్లు విసిరారు. ఆయన ఇలా మాట్లాడతాడని తాను ముందే ఊహించానని... కాబట్టి ఈ వ్యాఖ్యలు ఏమీ ఆశ్యర్యపర్చలేవని అన్నారు.  

''ఆశ్చర్యం లేదు. ఊహించిందే. ప్రపంచంలో ఎక్కడ కోవిడ్ వ్యాక్సిన్ తయారైనా తన ఖాతాలో వేసుకుంటాడని. ప్రపంచ ప్రఖ్యాత అమరావతి మాయా నగరం లాగే ఈయన సృష్టించిన బయోటెక్ పార్కులో వ్యాక్సిన్ తయారవుతోందని ప్రజలంతా కృతజ్ఞత వ్యక్తం చేసారట. మైండ్ డీజనరేట్ అవుతోంది. గొలుసులు సిద్ధం చేయాల్సిందే'' అంటూ  ట్విట్టర్ ద్వారా చంద్రబాబుపై సెటైర్లు వేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. 

''బాబు లాగే ఆయన క్రిమినల్ మాఫియా 1990 ల నాటి చిప్ లనే వాడుతున్నారు. భాస్కర్ రావు హత్యకు స్కెచ్ వేసి కలెక్టరేట్ కు వెళ్లాడట కొల్లు రవీంద్ర. సెల్ ఫోన్లు, సిసి కెమెరాలు లేనప్పుడు ఈ ఎలిబీలు, సాక్షాలు పనికొచ్చేవేమో. నేరం చేసినా, సుపారి ఇచ్చినా తప్పించుకోలేరు ఇప్పుడు'' అని హెచ్చరించారు. 
 
 ఇక ''బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించానని కోతలు కోస్తున్న బాబు 14 ఏండ్లు సిఎంగా ఉండి ఎన్టీఆర్ కు అత్యున్నత పురస్కారం ఎందుకు ఇప్పించుకోలేక పోయాడు. రాష్ట్రపతులు, ప్రధానులను ఎంపిక చేయడం అబద్ధాలైనా అయి ఉండాలి. ఎన్టీఆర్ కు దక్కకుండా అడ్డుకోనైనా ఉండాలి. ఇందులో ఏది నిజం బాబూ'' అంటూ మరో ట్వీట్ ద్వారా చంద్రబాబును విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. 

click me!