పచ్చచొక్కా నేతలు.. శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు.. విజయసాయిరెడ్డి

By ramya neerukondaFirst Published Nov 5, 2018, 4:07 PM IST
Highlights

టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు.

టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. ట్విట్టర్ వేధికగా.. సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ నేతలు విఫలమయ్యారని మండిపడ్డారు.

‘‘శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు పచ్చ చొక్కా నేతలు! తిత్లీ తుపాను విధ్వంసంతో కొబ్బరి, జీడి, వరి రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంటే.. బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని  హైజాక్‌ చేసిన పచ్చ చొక్కాలు దానిని కూడా గుటకాయ స్వాహా చేసి రైతుల నోట్లో మన్ను కొట్టారు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు పచ్చ చొక్కా నేతలు! తిత్లీ తుపాను విధ్వంసంతో కొబ్బరి, జీడి, వరి రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంటే ఎన్యూమరేషన్‌ను హైజాక్‌ చేసిన పచ్చ చొక్కాలు దానిని కూడా గుటకాయ స్వాహా చేసి రైతుల నోట్లో మన్ను కొట్టారు.

— Vijayasai Reddy V (@VSReddy_MP)

మరో ట్వీట్ లో ‘‘ సెంటు భూమి లేని వారు సైతం 150 నుంచి 200 కొబ్బరి చెట్లు కోల్పోయినట్లు రాయించుకున్న ఘటనలు కోకొల్లలు! 0.30 సెంట్లు భూమి ఉంటే 3 ఎకరాలని నమోదు. ఎకరాకి 60 కొబ్బరి చెట్లు చొప్పున 3 ఎకరాలకు 180 చెట్లు. పరిహారం 2.70 లక్షలు. కాకి లెక్కలతో పచ్చ చొక్కాలు పరిహారాన్ని హాంఫట్‌ చేసిన తీరిది!’’ అంటూ తిత్లీ తుఫాను బాధితులకు పరిహారం పేరిట చేస్తూన్న మోసాన్ని వివరించారు. 

click me!