చంద్రబాబుపై పొగడ్తలు, జగన్ కి చురకలు అంటించి జేసీ

Published : Nov 05, 2018, 02:12 PM IST
చంద్రబాబుపై పొగడ్తలు, జగన్ కి చురకలు అంటించి జేసీ

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాకపోతే ఈసారి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాకపోతే ఈసారి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో ముందుచూపున్న నాయకుడు చంద్రబాబేనని జేసీ వ్యాఖ్యానించారు.
 
విజన్‌, పట్టుదల, ఏదైనా చేయాలనే తపన ఉన్న నాయకుడు ఒక్క చంద్రబాబేనని అన్నారు. నదుల అనుసంధానం గురించి దశాబ్దాల కిందటే నిపుణులు చెప్పారని, దాన్ని అమలు చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబేనన్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కలలు కన్న భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)కు నీరు తేవడం  మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరిలకే సాధ్యమైందన్నారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాకపోతే అనంతపురం చెరువులకు నీరొచ్చే ప్రసక్తే లేదన్నారు. అందుకే ఆయనను మరోసారి సీఎంగా ఎన్నుకోవాలని కోరారు. అలాకాకుండా జగన్ కి ఓటు వేస్తే సంకనాకి పోయినట్లేనని పేర్కొన్నారు.

ఉరవకొండ నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చిన మనిషి పయ్యావుల కేశవ్ అని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్