విశాఖ క్రేన్ ప్రమాదం.. ఎంతటి వారున్నా వదిలేదు: విజయసాయి రెడ్డి

By Siva KodatiFirst Published Aug 2, 2020, 6:40 PM IST
Highlights

విశాఖ క్రేన్ ప్రమాదానికి కారకులు ఎంతవారైనా వదిలిపెట్టకూడదన్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి. క్రేన్ క్రేన్ కుప్పకూలి 11 మంది దుర్మరణం పాలవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

విశాఖ క్రేన్ ప్రమాదానికి కారకులు ఎంతవారైనా వదిలిపెట్టకూడదన్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి. క్రేన్ క్రేన్ కుప్పకూలి 11 మంది దుర్మరణం పాలవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .

ఈ ఘోర దుర్ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నానని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు విజయసాయి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి పట్ల తన హృదయం చలించిపోయిందని, వారు ఈ విషాదం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు విజయసాయి ట్వీట్ చేశారు.

Also Read:విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డు ప్రమాదం: అనుపమ్ క్రేన్ సంస్థపై కేసు

ఈ ఘటనలో శాఖాపరమైన విచారణ షురూ అవుతుందని వెల్లడించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి అనుపమ్ క్రేన్ సంస్థపై విశాఖ పోలీసులు 304 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 2017 ఆగస్టులో ఈ క్రేన్ షిప్ యార్డ్‌కు చేరుకుంది.

అయితే ఈ క్రేన్‌లో లోపాలను గుర్తించడంతో దానిని మూడేళ్లుగా హిందుస్తాన్ షిప్ యార్డ్ ఉపయోగించడం లేదు. గ్రీల్ ఫీల్డ్, లీడ్ ఇంజనీర్స్, స్వ్యాడ్ సంస్థల సహాయంతో ఈ భారీ క్రేన్‌ను గుర్తించిన లోపాలను సరి చేయించారు. 
 

click me!