కరోనా ఎఫెక్ట్.. ప్రజల కోసం, పుట్టినరోజు వేడుకలకు ఏపీ గవర్నర్ దూరం

By Siva KodatiFirst Published Aug 2, 2020, 5:46 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 3న తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు

రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 3న తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అలాగే వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాజ్‌భవన్‌కు ఎవరూ రాకూడదని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

ఇళ్లలోనే ఉండి, అవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండటం, సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ ధరించడం, శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని తెలిపారు.

Also Read:కర్నూలులో ఉగ్రరూపం: ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా అవసరమైన అన్ని ప్రోటోకాల్స్, పద్ధతులను పాటించడం ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తిని నివారించవచ్చని గవర్నర్ చెప్పారు.

కాగా ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 50 వేల 209కి చేరుకోగా, 1,407 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి వరకు 20 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించింది. 

click me!