జగన్ కు వైసీపీ ఎంపీ షాక్: అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పై చంద్రబాబును వెనకేసుకొచ్చిన రఘురామకృష్ణం రాజు

Published : Dec 28, 2019, 02:14 PM ISTUpdated : Dec 28, 2019, 02:53 PM IST
జగన్ కు వైసీపీ ఎంపీ షాక్: అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పై చంద్రబాబును వెనకేసుకొచ్చిన రఘురామకృష్ణం రాజు

సారాంశం

ఈ మధ్యకాలంలో వైసీపీ కి దూరంగా బీజేపీకి దగ్గరగా ఉంటూ వస్తున్న రఘురామ కృష్ణం రాజు ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు లో చంద్రబాబు ను ఇరికించడం సాధ్యం కాదని బల్లగుద్ది చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజధాని చుట్టూ ప్రస్తుతం తిరుగుతున్నాయి. రాజధాని రైతుల నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో జగన్ సర్కారు రాజధాని నిర్ణయాన్ని కొద్దిరోజులపాటు వాయిదా వేసింది. టీడీపీ మీద ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన వైసీపీ ప్రభుత్వం వారిపైన విచారణ జరుపుతామని, వారిని దోషులుగా తేలుస్తామని తెలిపింది. ఇటీవల, ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి బుగ్గన టీడీపీ నేతలతో సహా వారి బినామీలు అమరావతిలో ఎంత భూమి కొన్నారో వివరించారు కూడా. 

ఈ విషయమై జగన్ కి ఒకింత పచ్చి వెళక్కాయలాగా మారిన ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఒక ఆసక్తికరవ్యాఖ్య చేసారు.  ఆయన ఈ మధ్యకాలంలో వైసీపీ కి దూరంగా బీజేపీకి దగ్గరగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. 

రఘురామ కృష్ణం రాజు ఈ విషయం పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు లో చంద్రబాబు ను ఇరికించడం సాధ్యం కాదని రఘురామ కృష్ణం రాజు బల్లగుద్ది చెప్పారు. 

Also read: రఘురామకృష్ణం రాజు ధిక్కారం: ఆయనకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం ఇదే...

ఓ మీడియా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రఘురామ ఈ వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు హయాం లో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ దర్యాప్తునకు రెడీ అవుతోంది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలోనే ఈ వైసీపీ ఎంపీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడున్న చట్టాల వల్ల చంద్రబాబు ను ఇరికించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టాలు మార్చడాన్ని పరిశీలించాలని ఆయన ప్రభుత్వానికి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. 

చంద్రబాబును ఫిక్స్ చేయడం కష్టమన్నారు. ఆయన అన్ని లూప్ హోల్స్ ను గమనించే ఇలాంటి వాటిల్లో చిక్కుకోకుండా తెలివిగా వ్యవహరిస్తుంటారని తెలిపారు. వైసీపీ ఎంపీ గా ఉంటూ చంద్రబాబు ను వెనకేసుకురావడం పై సొంత పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్