
ఓ మహిళ పట్ల వైసీపీ ఎమ్మెల్యే అదిప్ రాజు దురుసుగా ప్రవర్తించారు. రేషన్ కార్డు అడిగినందుకు మహిళను బెదిరిస్తూ... ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. అయితే... సదరు మహిళ తనకు రేషన్ కార్డు ఇప్పించమంటూ... ఎమ్మెల్యే చేతులు పట్టుకొని బ్రతిమిలాడింది.
ఆమె చేతులు పట్టుకోవడం పట్ల ఎమ్మెల్యే అదిప్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి వదులు అంటూ తీవ్ర స్వరంతో గద్దించారు. పనులు కావాలంటే బతిమాలుకోవాలి.. అంతేకానీ బెదిరిస్తే.. బెదిరేవాళ్లు ఎవరు లేరని మహిళపై సీరియస్ అయ్యారు.
ఎలా అడగాలో తెలియకపోతే ఇబ్బందిపడతావంటూ మహిళను ఎమ్మెల్యే హెచ్చరించారు. పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెం సచివాలయం భవనం వేదికగా ఈ ఘటన చోటుచేసుకుంది.