తన హత్యకు కుట్ర జరుగుతుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. జార్ఖండ్ కు చెందిన వ్యక్తులతో ఈ హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ: జార్ఖండ్ కు చెందిన వారితో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని నర్సాపురం ఎంపీ Raghurama krishnam raju సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం నాడు న్యూఢిల్లీలో Ycp రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై అన్ని వివరాలతో ప్రధాని Narendra modiకి లేఖ రాయనున్నట్టుగా రఘురామకృష్ణం రాజు తెలిపారు. గుంటూరులో tdp నేత చంద్రయ్యను హత్య చేయడాన్ని రఘురామకృష్ణం రాజు ప్రస్తావిస్తూ వ్యక్తులు నచ్చకపోతే వ్యక్తులను, వ్యక్తులను జగన్ తీసేస్తారన్నారు. Bjp ఎంపీ Bandi Sanjay ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ విషయంలో స్పందించినట్టుగానే AP Cid చీఫ్ Sunil kumar పై తాను ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై స్పందించాలని Loksabha speaker Om birla కోరారు.
జగనన్న గోరుముద్ద పథకం రాష్ట్రంలో కొనసాగదన్నారు. ఈ విషయమై తాను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖకు ఆమె స్పందించారని రఘురామకృష్ణం రాజు చెప్పారు. Chiranjeeviని అల్లరి చేసేందుకే ఓ పత్రికలో Rajyasabhaకు పంపుతున్నట్టుగా కథనం రాయించారని వైసీపీపై రఘురామకృష్ణం రాజు విమర్శలు చేశారు. చిరంజీవి చెప్పకపోతే సినీ పరిశ్రమలోని సమస్యలు సీఎం జగన్ కు తెలియవా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరాడుతున్న Pawan kalyan కళ్యాణ్ కు చిరంజీవి మద్దతివ్వాలని ఆయన కోరారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా మీడియాలో వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఐడీ అధికారులు 2021 మే 14న రఘురామకృష్ణంరాజును హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యవహరించారని 124-ఏ , ఐపీసీ 153 - బీసెక్షన్ కింద సీఐడీ కేసు నమోదుచేసింది. దీంతో పాటుగా ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను సీఐడీ అరెస్ట్ చేసింది.
తనపై నమోదైన కేసుల విషయమై పలు కోర్టుల్లో రఘురామకృష్ణంరాజు పిటిషన్లు దాఖలు చేశారు. చివరకు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.దీంతో 2021 మే 21న రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని తెలిపింది.
సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో విచారణకు సహకరించాలని కూడా బెయిల్ సందర్భంగా కోర్టు సూచించింది. అయితే ఈ కేసుల్లో విచారణకు హాజరు కావాలని కూడా ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సీఐడీ అధికారులు సమాచారం పంపారు. అయితే విచారణకు రఘురామకృష్ణంరాజు హాజరు కాలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై విచారణకు హాజరు కావాలని కోరుతూ రఘురామకృష్ణంరాజుకు ఈ నెల 12న నోటీసులు ఇచ్చారు.ఈ నెల 17న విచారణకు రావాలని కోరారు సీఐడీ అధికారులు, విచారణకు హాజరౌతానని రఘురామకృష్ణంరాజు మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే.