పవన్ పై పేర్ని నాని కామెంట్స్.. పార్టీకే చేటంటున్న రఘురామ

Published : Sep 29, 2021, 10:06 AM ISTUpdated : Sep 29, 2021, 10:07 AM IST
పవన్ పై పేర్ని నాని కామెంట్స్.. పార్టీకే చేటంటున్న రఘురామ

సారాంశం

 ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తే.. పార్టీకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందన్న వాస్తవాన్ని గమనించాలని సూచించారు. పవన్‌ను ఓ మంత్రి వ్యక్తిగతంగా దూషిస్తూ, కుల ప్రస్తావన కూడా తేవడం బాధాకరమన్నారు.   

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి, ఆయన వైవాహిక జీవితంపై ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామ స్పందించారు. పవన్ వ్యక్తిగత జీవితం గురించి మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు నీచాతినీచమని రఘురామ పేర్కొన్నారు.

ఒక మంత్రిగా ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగ ద న్నారు. పవన్‌ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ఆ మంత్రికేం సంబంధమని ప్రశ్నించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తే.. పార్టీకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందన్న వాస్తవాన్ని గమనించాలని సూచించారు. పవన్‌ను ఓ మంత్రి వ్యక్తిగతంగా దూషిస్తూ, కుల ప్రస్తావన కూడా తేవడం బాధాకరమన్నారు. 

కుక్కలు, గ్రామ సింహాలు, వరాహాలు.. అంటూ విమర్శించుకోవడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై జగన్‌ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని రఘురామరాజు విమర్శించారు. ఎంతో వెనుకబడిన రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులను కూడా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇరిగేషన్‌ ద్వారా సన్న, చిన్నకారు రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించడంపై దృష్టి పెట్టకుండా.. ఎంతసేపూ చేపలు, మాంసం, సినిమా టికెట్ల అమ్మకాలపై ఆసక్తి చూపడం శోచనీయమని విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం