పవన్ ని తిడితే కాపు సమాజాన్ని తిట్టినట్టే... 2024లో దీని రిజల్ట్ చూపిస్తాము: జగన్ కి కాపు సేన హెచ్చరిక

Published : Sep 29, 2021, 08:59 AM IST
పవన్ ని తిడితే కాపు సమాజాన్ని తిట్టినట్టే... 2024లో దీని రిజల్ట్ చూపిస్తాము: జగన్ కి కాపు సేన హెచ్చరిక

సారాంశం

పవన్ కళ్యాణ్ ని కాపు మంత్రులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనుక జగన్‌ హస్తం ఉందని కాపు సంక్షేమ సేన లేఖలో ఆరోపించింది. పవన్‌ను అవమానించడమంటే.. కాపు సమాజాన్ని అవమానపరచడమే అని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ (Pawan kalyan) చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపాయి. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు సహా పోసాని (Posani krishna Murali) వంటి వారు ప్రెస్ మీట్లలో పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా నిన్న పోసాని పై పవన్ అభిమానులు దాడి చేసే వరకు వెళ్లారు. 

Also Read: పవన్ ఫ్యాన్స్‌తో ప్రాణహానీ, నాకు ఏం జరిగినా ఆయనదే బాధ్యత: పోసాని కృష్ణమురళీ

నిన్న పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు ప్రచురించడానికి కూడా వీలు లేని వ్యాఖ్యలతో కూడుకొని ఉన్నాయి. వాస్తవానికి మొన్నటి ప్రెస్ మీట్ తరువాత పోసానిపై పవన్ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణమురళీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.   పవన్ కల్యాణ్ పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారని, వారంతా సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని, బూతులు తిడుతున్నారని అంటూ తాను సైతం బూతు పురాణాన్ని ఓపెన్ చేసాడు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటినుండో కూడా రాజకీయాల్లో కుల సమీకరణాలను మనం చూస్తూనే ఉన్నాము. ఒక పార్టీని ఎవరైనా దూషిస్తే అదే కులానికి చెందిన వ్యక్తితో తిరిగి తిట్టించడం అనేది రివాజు. అదే తరహాలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే అదే కులానికి చెందిన మంత్రులు ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఇది వైసీపీ కి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. 

తాజాగా కాపు సంక్షేమ సమితి అధ్యక్షుడు హరిరామ జోగయ్య (Hari Rama Jogaiah) బహిరంగ లేఖను విడుదల చేసారు. ఈ లేఖలో పవన్ కళ్యాణ్ ని కాపు మంత్రులు (Kapu Ministers) తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనుక జగన్‌ (AP CM YS Jagan) హస్తం ఉందని కాపు సంక్షేమ సేన లేఖలో ఆరోపించింది. పవన్‌ను అవమానించడమంటే.. కాపు సమాజాన్ని అవమానపరచడమే అని పేర్కొంది. 2024 ఎన్నికల్లో వీటి పర్యవసానాన్ని సీఎం జగన్ ఎదుర్కోవాల్సి వస్తుందని కాపు సంక్షేమ సేన జగన్ కి వార్నింగ్ ఇచ్చింది.

Also read: నా భార్యను లాగుతారా, అదే జరిగితే మీ ఇంట్లో స్త్రీలపై నేనూ మాట్లాడుతా.. పవన్ కు పోసాని హెచ్చరిక

మాజీ హోమ్ మంత్రి హరిరామ జోగయ్య కాపులకు పెద్ద దిక్కు. కాపు సంక్షేమ సేనకు వ్యవస్థాపక అధ్యక్షులు. ఎప్పటినుండో రాజకీయ అధికారం కోసం ఎదురు చూస్తున్న కాపులకు దిశా నిర్దేశం చేస్తున్న సీనియర్ నాయకుడు. ఈయన లేఖ విడుదల చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడీ ఓటమికైనా, 2019 లో జగన్ అత్యంత భారీ గెలుపుకైనా కారణం కాపు ఓట్లే..! ఆ విషయం వైసీపీ ఎరుగును కూడా..! ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య లేఖ వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టడం తథ్యం..!

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం