బ్రేకింగ్ న్యూస్: క్షీణించిన మేకపాటి ఆరోగ్యం: బలవంతంగా ఆసుపత్రికి తరలింపు

First Published Apr 7, 2018, 3:41 PM IST
Highlights
శనివారం ఉదయం నుండి మేకపాటికి కడుపునొప్పితో అవస్తలు పడుతున్నారు.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైసిపి ఎంపిల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. మధ్యాహ్నం నుండి వాంతులతో బాగా ఇబ్బంది పడుతున్నారు.

శనివారం ఉదయం నుండి మేకపాటికి కడుపునొప్పితో అవస్తలు పడుతున్నారు. వైద్యులు వచ్చి పరీక్షించి నిరాహారదీక్షను విరమించాల్సిందిగా సూచించారు.

అయినా ఎంపి వారి మాట వినకుండానే దీక్ష కొనసాగిస్తున్నారు. హటాత్తుగా మధ్యాహ్నం నుండి అనారోగ్యం మొదలైంది. మళ్ళీ కడుపులో నొప్పి మొదలై  వెంటనే వాంతులు కూడా అయ్యాయి.

విషయం వైద్యులకు చేరి వారు వచ్చేలోగానే నాలుగైదుసార్లుల వేదిక పక్కనే వాంతులు చేసుకున్నారు. నిరాహారదీక్షకు బహుశా ఎంపి శరీరం సహకరించటం లేదేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఎందుకంటే, మేకపాటి 75 ఏళ్ళ వయస్సు. వయస్సుతో పాటు బిపి, షుగర్ లాంటి అనారోగ్యాలు కూడా ఉన్నాయి. వేళకు భోజనం చేసి మందులు వేసుకోకపోతే ఆరోగ్యం వికటించే అవకాశాలున్నాయి.

మందులు వేసుకోవాంలటే వేళకు భోజనం తప్పదు. అటువంటిది దాదాపు 24 గంటలుగా మేకపాటికి భోజనం లేదు కాబట్టి బహుశా మందులు కూడా వేసుకుంటున్నట్లు లేదు.

అందుకనే శరీరధర్మంలో మార్పులు మొదలైపోయాయి. అందుకే ఎంపి దీక్ష చేయటాన్ని వైద్యులు అంగీకరించటంలేదు. వైద్యుల సలహా మేరకే పోలీసులు మేకపాటిని బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆసుత్రికి తరలించారు.   

click me!