బ్రేకింగ్ న్యూస్ : వైఎస్సార్ బయోపిక్ టైటిల్ ‘యాత్ర’...హీరోగా మమ్ముట్టి

First Published 7, Apr 2018, 1:18 PM IST
Highlights
వైఎస్సార్ బయోపిక్ కు యాత్ర అనే పేరును ఖరారు చేసినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరుతో తీస్తున్న సినిమా యత్రలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పేరు అధికారికంగా ప్రకటించారు.  వైఎస్సార్ బయోపిక్ కు యాత్ర అనే పేరును ఖరారు చేసినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సుమారు 1700 కిలోమీటర్లకు చేరుకున్న సమయంలో సినిమా యూనిట్ యాత్ర అఫీఫియల్ పోస్టర్ ను విడుదల చేయటం గమనార్హం.

ఆ పోస్టర్లో కడప దాటి ప్రతీ గడపలోకి వస్తున్నాను..మీతో కలిసి నడవాలనుంది..మీ గుండె చప్పుడు వినాలనుందిఅనే ట్యాగ్ లైన్ ముద్రించారు. యాత్ర అంటే బయోపిక్ షూటింగ్ ఏప్రిల్ 9వ తేదీన మొదలవుతున్నట్లు పోస్టర్లో చెప్పారు.

బయోపిక్ యాత్ర టైటిల్ ను పాదం ముద్రలో అద్భుతంగా డిజైన్ చేశారు.

 

Last Updated 7, Apr 2018, 1:18 PM IST