చెన్నైలోనే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

By narsimha lodeFirst Published Mar 21, 2023, 11:08 AM IST
Highlights

వైసీపీ  ఎంపీ  మాగుంట  శ్రీనివాసులు  రెడ్డి  చెన్నైలోనే  ఉణ్నారని  ఆయన  కార్యాలయ సిబ్బంది  చెప్పారు.  శ్రీనివాసులు రెడ్డి  ఢిల్లీ వచ్చారని  కార్యాలయ సిబ్బంది  కూడా  తొలుత  భావించారు.  కానీ  ఆయన చెన్నైలోనే  ఉన్నారు. 

న్యూఢిల్లీ:  వైసీపీ ఎంపీ  మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారంనాడు చెన్నై నుండి న్యూఢిల్లీకి చేరుకున్నారనే  ప్రచారం సాగింది. అయితే  ఈ ప్రచారంలో  వాస్తవం లేదని  మాగుంట శ్రీనివాసులు రెడ్డి  కార్యాలయ సిబ్బంది   సమాచారం  ఇచ్చారని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం  చేసింది.మాగుంట  శ్రీనివాసులు రెడ్డి  చెన్నైలోనే  ఉన్నారని   వైసీపీ ఎంపీ  శ్రీనివాసులు రెడ్డి  కార్యాలయ సిబ్బంది  చెప్పారని  ఆ కథనం తెలిపింది.  

 ఇవాళ విచారణకు  రావాలని మాగుంట  శ్రీనివాసలు రెడ్డికి ఈడీ నోటీసులు  జారీ  చేసిందని నిన్న మీడియాలో  కథనాలు  వచ్చాయి. కానీ ఈ విషయమై  స్పష్టత రాలేదు. ఈ నెల 18వ తేదీన  వైసీపీ  ఎంపీ  మాగుంట  శ్రీనివాసులు  రెడ్డిని  విచారణకు రావాలని  ఈడీ  అధికారులు నోటీసులు  జారీ  చేశారు.  కానీ  వ్యక్తిగత  కారణాలతో  ఈడీ విచారణకు మాగుంట  శ్రీనివాసులు రెడ్డి  హాజరు కాలేదు.  మరో రోజున  తనను విచారణకు పిలవాలని ఈడీ అధికారులను  మాగుంట  శ్రీనివాసులు  రెడ్డి  కోరారు.

.   ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు  మాగుంట  రాఘవరెడ్డి  అరెస్టైన విషయం తెలిసిందే .ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సౌత్ గ్రూప్ పై  దర్యాప్తు సంస్థలు  కేంద్రీకరించాయి.  ఈ దిశగానే  సీబీఐ, ఈడీలు  దర్యాప్తు  చేస్తున్నాయి.సుమారు  రూ. 100 కోట్లు  చేతులు మారాయని  దర్యాప్తు  సంస్థలు  ఆరోపణలు  చేస్తున్నాయి.  సౌత్ గ్రూప్  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కీలకంగా  వ్యవహరించిందని  దర్యాప్తు  సంస్థలు  ఆరోపిస్తున్నాయి. 

 ఇప్పటికే  రెండు తెలుగు  రాష్ట్రాలకు  చెందిన  పలువురిని  దర్యాప్తు  సంస్థలు అరెస్ట్  చేశాయి.  తెలంగాణ  రాష్ట్రానికి  చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   రెండు దఫాలు ఈడీ విచారణకు  హాజరయ్యారు.  ఇవాళ  మరోసారి  కవిత  ఈడీ విచారణకు  హాజరు కానున్నారు. 

click me!