AP ICET 2023: ఏపీ ఐసెట్ కు రిజిస్ట్రేషన్లు షురూ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

By Mahesh RajamoniFirst Published Mar 20, 2023, 6:42 PM IST
Highlights

AP ICET 2023: ఆంధ్రప్ర‌దేశ్ లోని వివిధ‌ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్-2023) దరఖాస్తుల ప్రక్రియ సోమ‌వారం నుంచి షురూ అయింది.
 

AP ICET 2023 Application & Registration: ఆంధ్రప్ర‌దేశ్ లోని వివిధ‌ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్-2023) దరఖాస్తుల ప్రక్రియ సోమ‌వారం నుంచి షురూ అయింది. అభ్య‌ర్థులు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సంబంధిత అధికార వ‌ర్గాలు తెలిపాయి. 

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్ 2023) రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమ‌వారం (మార్చి 20న‌) ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ/ ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులను చేర్చుకోవడానికి ఐసెట్ ను నిర్వహిస్తారు.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ 19 ఏప్రిల్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఏపీ ఐసెట్ 2023 హాల్ టిక్కెట్ల‌ను ఈ నెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది. ఏపీ ఐసెట్ 2023 పరీక్షను మే 25, 26 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.

ఏపీ ఐసెట్ 2023ను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది ప్ర‌క్రియ‌ను అనుస‌రించండి.. 

ముందుగా అధికార‌కి వెబ్ సైట్ cets.apsche.ap.gov.in లాగిన్ అవ్వ‌డి. 

  • హోమ్ పేజీలో ఏపీ ఐసెట్ 2023 లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఒపెన్ అవుతుంది. కొత్త పేజీ లోడ్ అయ్యే వరకు వేచి ఉండండి. 
  • అర్హతా ప్రమాణాలను పరిశీలించి దరఖాస్తు ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లింపు స్థితిని స‌రిచూసుకోండి. 
  • అప్లికేషన్ ఫారం నింపి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కొరకు ఫారమ్ సబ్మిట్ చేసిన త‌ర్వాత‌.. మొత్తం పూర్తి అప్లికేష‌న్ ను  డౌన్ లోడ్ చేసుకోండి.
click me!