రాష్ట్ర ప్రయోజనాల కోసమే.... మండలి రద్దుపై డిప్యుటీ సీఎం

By telugu teamFirst Published Jan 28, 2020, 9:55 AM IST
Highlights

అందరికీ ఆమోదయోగ్యమైన చోట రాజధాని పెట్టాలని శివరామకృష్ణ కమిటీ చెబితే.. చంద్రబాబు పట్టించుకోకుండా నారాయణ కమిటీ వేసి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని మండిపడ్డారు.  చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని వివరించారు. 

శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని ఏపీ డిప్యుటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిప్రాయపడ్డారు. అలాంటి సభలో తాను సభ్యుడినై ఉన్నప్పటికీ మండలి రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

గతంలో ఎన్టీఆర్ మండలి చాలా స్వల్పకాలిక ప్రయోజనం కోసం రద్దు చేశారని చెప్పారు. ఈనాడు రామోజీరావు కోసం అప్పట్లో ఎన్టీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కానీ జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం మండలిని రద్దు చేశారని చెప్పారు.

అందరికీ ఆమోదయోగ్యమైన చోట రాజధాని పెట్టాలని శివరామకృష్ణ కమిటీ చెబితే.. చంద్రబాబు పట్టించుకోకుండా నారాయణ కమిటీ వేసి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని మండిపడ్డారు.  చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని వివరించారు.  మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరమన్నారు.

Also Read ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్: ఆ ముగ్గురు ఏం చేశారో తెలుసా?...

మండలి చైర్మన్‌ ఒక పార్టీ పట్ల పక్షపాతంగా వ్యవహరించడం క్షమించరాని నేరమన్నారు.. సభాపతులుకున్న నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ఒక కమిటీ వేయాలని కోరుతున్నానని చెప్పారు.  మండలిలో జరిగిన దాని గురించి అసెంబ్లీలో చర్చించకూడదని కొందరు అంటున్నారని...జరిగిన తప్పును చర్చించకపోతేనే తప్పు అవుతుందన్నారు.  మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

ఈ మండలి రద్దుపై మంత్రి మోపీదేవి వెంకటరమణ కూడా స్పందించారు.  తాను పదవిని వదులకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  రాష్ట్ర భవిష్యత్‌ కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు. పెద్దల సభగా పిలిచే శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నామని చెప్పారు.

పాలకులు ప్రజల కోసం ఈ సభలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై పెద్దల సభలో మంచి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. గడచిన నాలుగు రోజుల్లో చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే బిల్లులను అపహాస్యం చేశారని మండిపడ్డారు.చంద్రబాబు నిర్వాకం వల్ల ఆ చట్ట సభల్లోని సభ్యులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.  

click me!