వివేకా హత్య కేసులో ట్విస్ట్... మరో పిటిషన్ వేసిన కుమార్తె సునీత

Published : Jan 28, 2020, 09:29 AM ISTUpdated : Jan 28, 2020, 09:31 AM IST
వివేకా హత్య కేసులో ట్విస్ట్... మరో పిటిషన్ వేసిన కుమార్తె సునీత

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14వ తేదీన తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సిట్ విచారిస్తోంది. ఈ హత్య జరిగిన సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.

వివేకా హత్య కేసులో మరో పిటిషన్ వేశారు. తన తండ్రి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే సీఎం జగన్, వివేకా భార్య, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ వేయగా... తాజాగా వివేకా కుమార్తె సునీత కూడా వేశారు.

అయితే... వివేకా హత్య కేసు విచారణ తుది దశలో ఉన్నందున సీబీఐ విచారణ అవసరం లేదని ప్రభుత్వ తేల్చిచెప్పింది. ఈ అన్ని పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14వ తేదీన తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సిట్ విచారిస్తోంది. ఈ హత్య జరిగిన సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.

ఈ హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని  టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మరో వైపు ఈ కేసు విచారణను సిట్ మరింత వేగవంతం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతించాలని  కోరుతూ సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేదని పరమేశ్వర్ రెడ్డి కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.

Also Read వైఎస్ వివేకా హత్య: బాబుకు హైకోర్టు నోటీసులు...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధానంగా ప్రస్తావించింది. జగన్ పై ఆ నాడు చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు విమర్శలపై వైసీపీ కూడ ఎదురు దాడికి దిగింది.

అయితే ఈ విషయమై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు హైకోర్టును ాశ్రయించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయమై ఎలాంటి ప్రకటనలు చేయకూడదని హైకోర్టు ఆ సమయంలో ఆదేశాలు జారీ చేసింది. 

చంద్రబాబునాయుడు ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేయించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం కూడ ఈ కేసును కూడ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీకి చెందిన నేతలను విచారించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu