పల్లెనిద్రలో వైసీపీ ఎంఎల్ఏలు

First Published Nov 13, 2017, 3:49 PM IST
Highlights
  • వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎంఎల్ఏలు పల్లె నిద్ర చేస్తున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎంఎల్ఏలు పల్లె నిద్ర చేస్తున్నారు. అంటే, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావటం కన్నా పల్లెల్లో తిరుగటం వల్లే ఎక్కువ ఉపయోగాలున్నాయని జగన్ భావించారు. దాంతో పాటు పల్లెల్లోనే నిద్రించటం వల్ల ప్రజాలతో మమేకం అయ్యామన్న తృప్తి కలుగుతుందని జగన్ నిర్ణయంతో  ఎంఎల్ఏలు అందరూ పల్లెబాట పట్టారు.

పల్లెల్లో తిరుగుతూ స్ధానికులతో సమస్యల గురించి చర్చిస్తున్నారు. సమస్యల పరిష్కారంపై వారితోనే మాట్లాడుతున్నారు. పల్లెల్లో తిరుగుతూ, పల్లెల్లోనే నిద్రించటం వల్ల క్షేత్రస్ధాయి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చన్న ఉద్దేశ్యంతోనే జగన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

తాను జన సంకల్ప యాత్రను చేస్తూనే మిగిలిన ఎంఎల్ఏలను పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా జగన్ ఆదేశించారు. ఎంఎల్ఏలు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

మూడున్నరేళ్ళుగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నా ఏ ఉపయోగం కనబడలేదని ఎంఎల్ఏలు చెబుతున్నారు. పల్లెనిద్ర కార్యక్రమంతో జనాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం వచ్చిందని ఎంఎల్ఏలు అంటున్నారు.

చంద్రబాబునాయుడు ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ నేరుగా పార్టీ కార్యక్రమంతో జనాల్లోకి వెళుతోంది.

 

click me!