బాలకృష్ణ ముందే మెంటల్... అసెంబ్లీ రానివ్వొద్దు..: స్పీకర్ ను కోరిన వైసిపి ఎమ్మెల్యే (వీడియో)

Published : Sep 22, 2023, 12:08 PM ISTUpdated : Sep 22, 2023, 12:12 PM IST
బాలకృష్ణ ముందే మెంటల్... అసెంబ్లీ రానివ్వొద్దు..: స్పీకర్ ను కోరిన వైసిపి ఎమ్మెల్యే (వీడియో)

సారాంశం

అసెంబ్లీలో విజిల్ ఊదుతూ ఆందోళన చేపట్టిన నందమూరి బాలకృష్ణపై వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మదుసూధన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో విజిల్ ఊదుతూ ఆందోళనకు దిగిన నందమూరి బాలకృష్ణపై వైసిపి ఎమ్మెల్యే  బియ్యపు మధుసూదన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెంటల్ బాలకృష్ణను అసెంబ్లీకి రానివ్వద్దని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు.సైకోలా వ్యవహరించే బాలకృష్ణ గన్ తీసుకువచ్చి ఎవరినైనా కాల్చినా కేసులు వుండవని... ఆయన మెంటల్ సర్టిఫికెట్ వుందంటూ ఎమ్మెల్యే మదుసూధన్ ఎద్దేవా చేసారు. 

కాలేజీలో అమ్మాయిలను చూసి పోకిరీలు విజిల్స్ వేసినట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని వైసిపి ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్లూట్ మీ బావ చంద్రబాబులాంటి జింకల ముందు ఊదితే బావుంటుంది... సింహం లాంటి జగన్ ముందు కాదని బాలకృష్ణను హెచ్చరించాడు. బాలకృష్ణ, ఆయన బావ చంద్రబాబు అసలైన సైకోలే కాదు పిచ్చోళ్ళు కూడా అంటూ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వీడియో 

మీసాలు తిప్పడానికి,  తొడలు కొట్టడానికి ఇదేమయినా సినిమానా... అయినా ఈ తిప్పేదేదో మీ నాన్నకు వెన్నపోటు పొడిచపుడు తిప్పితే బావుండేదంటూ బాలకృష్ణపై మండిపడ్డారు. ఇప్పుడిలా అసెంబ్లీలో వీధి రౌడీలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. తన తండ్రి చావుకు కారణమైనోడి కళ్లలో ఆనందం చూసేందుకే బాలకృష్ణ ఇదంతా చేస్తున్నాడని అన్నారు. ముందు ఆయనను సభనుండి బయటకుపంపించి మెంటల్ హాస్పిటల్ కు తరలించాలని ఎమ్మెల్యే మదుసూధన్ కోరారు. 

Read More  సైకో పాలన ఏనాడో పోయింది... సైకో బాబు రాజమండ్రి జైలుకు..: మంత్రి జోగి రమేష్

తండ్రిని వెన్నోపోటు పొడిచి సీఎం సీట్లో కూర్చున్నాం ఏం చేయలేకపోయిన బాలకృష్ణ కనీసం అసెంబ్లీలో అయినా చంద్రబాబు కుర్చీలో కూర్చున్నాడని... ఇది పైనుంచి చూసిన ఎన్టీఆర్  సంతోషపడి వుంటారన్నారు. నందమూరి కుటుంబసభ్యులు కూడా ఆనందపడి వుంటారన్నారు వైసిపి ఎమ్మెల్యే. 

సభలో గందరగోళం సృష్టిస్తున్న బాలకృష్ణతో పాటు టిడిసి సభ్యులందరినీ సస్పెండ్ చేయాలని  మదుసూధన్ స్పీకర్ ను కోరారు. వాళ్లందరినీ వెంటనే మెంటల్ హాస్పటల్లో చేర్చించాల్సిన అవసరం వుందన్నారు. ముఖ్యంగా మెంటల్ ప్రాబ్లమ్ ఉన్న బాలకృష్ణను సభలోకి రానివ్వొద్దని వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మదుసూధన్ సూచించారు.  


   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP & Telangana Rain Alert: వాతావరణశాఖ హెచ్చరిక రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు | Asianet Telugu
అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం@ అమరావతి | CM Chandrababu Naidu Fire Vehicles Launch