టిడిపిని బిజెపిలో విలీనం చేయాలి: నాని సంచలన వ్యాఖ్యలు

First Published Feb 21, 2018, 1:37 PM IST
Highlights
  • కేంద్రం నుండి ఏపికి నిధులు రావాలంటే టిడిపిని బిజెపిలో విలీనం చేయటమొకటే మార్గమన్నారు.

గుడివాడ వైసిపి ఎంఎల్ఏ కొడాలినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంపార్టీని బిజెపిలో వెంటనే విలీనం చేయాలంటూ నాని చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. కేంద్రం నుండి ఏపికి నిధులు రావాలంటే టిడిపిని బిజెపిలో విలీనం చేయటమొకటే మార్గమన్నారు. ప్రత్యేకహోదాపై విజయవాడలో బుధవారం జరుగుతున్న చర్చా వేదికలో నాని మాట్లాడుతూ, చంద్రబాబు వ్యవహారాలు మొత్తం ప్రధానమంత్రి నరేంద్రమోడికి బాగా తెలుసన్నారు.

‘ఓటుకునోటు’ కేసులో దొరికిన తర్వాత చంద్రబాబు కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగ తయారైనట్లు నాని ఆరోపించారు. కేవలం తనపై ఉన్న కేసు వల్లే చంద్రబాబు కేంద్రంతో గట్టిగా మాట్లాడలేకున్నట్లు ధ్వజమెత్తారు. చంద్రబాబు లాగ జగన్ వెన్నుపోటు రాజకీయాలు చేయలేదన్నారు. ప్రత్యేకహోదా కోసం  వైసిపి ఎంపిల రాజీనామాలు, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో జగన్ ప్రకటనలు విన్న తర్వాత చంద్రబాబుకు ఏం మాట్లాడాలో కూడా దిక్కు తెలీటం లేదని ఎద్దేవా చేశారు.

మూడున్నరేళ్ళ పాటు ఏపికి కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తోందంటూ చెప్పిన చంద్రబాబు ఇపుడు మాత్రమే ఎందుకు అడ్డం తిరుగుతున్నారో అందరికీ తెలుసన్నారు. ఏపికి కేంద్రం ఏ విధంగానూ సాయం చేయకపోయినా ఇంతకాలం చంద్రబాబు ఎందుకు కేంద్రం భజన చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసిపి అధ్యక్షుడు జగన్ తన శాయసక్తులా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అందుకే మూడేళ్ళ నుండి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేసింది ఒక్క వైసిపినే అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని కొడాలి నాని స్పష్టం చేశారు.

click me!