నకిలీ వ్యక్తులకు నవరత్నాలు నకిలీరత్నాలుగానే కనిపిస్తాయి: విపక్షాలకు కాకాని కౌంటర్

Siva Kodati |  
Published : Jun 13, 2021, 04:07 PM IST
నకిలీ వ్యక్తులకు నవరత్నాలు నకిలీరత్నాలుగానే కనిపిస్తాయి: విపక్షాలకు కాకాని కౌంటర్

సారాంశం

జగన్ గొప్ప పాలనను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఫైరయ్యారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏ ముఖ్యమంత్రి చెయ్యనటువంటి సాహసాలు సీఎం జగన్ చేస్తున్నారని ప్రశంసించారు

జగన్ గొప్ప పాలనను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఫైరయ్యారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏ ముఖ్యమంత్రి చెయ్యనటువంటి సాహసాలు సీఎం జగన్ చేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను పరిష్కరిస్తుందని గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ వ్యక్తులకు నవరత్నాలు నకిలీ రత్నాలుగానే కనిపిస్తున్నాయంటూ సెటైర్లు వేశారు. నెల్లూరు జిల్లాలో వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read:నేను, నా కుటుంబం సర్వనాశనం: ఆనందయ్య మందుపై విపక్షాలకు కాకాని కౌంటర్

ప్రజాప్రతినిధులు ప్రమాణస్వీకారం చేసి రెండేళ్ళు పూర్తి అయిందని... 2019 ఎన్నికల్లో జిల్లాలో 10 కి 10 స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుందని ఆయన గుర్తుచేశారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని..  కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే అనాథలుగా మారిన బిడ్డలకు 10 లక్షలు ఇచ్చేలా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామని గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని కుటుంబాలకు ఆనందయ్య మందును అందించామని ఆయన వెల్లడించారు. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందజేస్తామని కాకాని గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

RK Roja Comments on Chandrababu Super Six: సూపర్ సిక్స్ – సూపర్ ప్లాప్ | Asianet News Telugu
నగరిలోచంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ | RK Roja Sensational Comments on Chandrababu | Asianet News Telugu