పట్టపగలే నడిరోడ్డుపై... రౌడీషీటర్ ను వెంటాడి నరికిచంపిన దుండగులు

Arun Kumar P   | Asianet News
Published : Jun 13, 2021, 02:16 PM ISTUpdated : Jun 13, 2021, 02:17 PM IST
పట్టపగలే నడిరోడ్డుపై... రౌడీషీటర్ ను వెంటాడి నరికిచంపిన దుండగులు

సారాంశం

శనివారం సాయంత్రం తెనాలి పట్టణంలో జరిగిన హత్య ఉదంతం తీవ్ర కలకలం రేకెత్తించింది.

గుంటూరు జిల్లా తెనాలిలో పట్టపగలే దారుణం జరిగింది. ఓ రౌడీ షీటర్ ను నడిరోడ్డుపై కొందరు దుండగులు అతి కిరాతకంగా మతమార్చారు. పట్టణంలోని అమరావతి కాలనీకి చెందిన చప్పిడి తరుణ్(30) ను తెలియని దుండగులు కత్తులతో నరికి చంపారు. కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద నిలబడి ఉన్న తరుణ్ ను మరో ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు వెంటపడి మరి కత్తులతో దాడి చేశారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించిన వెంబడించి వెంబడించి అతి దారుణంగా ఇళ్ల మధ్యలో నరికి చంపారు. 

శనివారం సాయంత్రం పట్టణంలో జరిగిన హత్య ఉదంతం తీవ్ర కలకలం రేకెత్తించింది. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రౌడీషీటర్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని... హత్య చేసిన వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

read more  ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని... గొంతుకోసి చంపిన మేనమామ

పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించటం కూడా రౌడీషీటర్లకు అనువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నియంత్రించకపోతే ఇంకా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయని పలువురు ఆరోపిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్