ఈ వైసీపీ ఎమ్మెల్యే అందుకే చెప్పుతో కొట్టుకున్నాడట

First Published Apr 16, 2017, 10:03 AM IST
Highlights

ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను చేస్తోందని ధ్వజమెత్తారు. 

దేశంలో ఈ మధ్య రాజకీయం అంతా చెప్పు చుట్టే తిరుగుతోంది. ఇష్టలేని రాజకీయ నాయకులకు బుద్దిచెప్పాలంటే సామాన్య జనం చెప్పునే ఆయుధంగా వాడుతున్నారు.  చాలా బహిరంగ సభల్లో ఇలా చెప్పు దాడికి బలైన రాజకీయ నాయకులు దేశంలో చాలా మంది ఉన్నారు.

 

ఆ మధ్య చిదంబరం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలా చెప్పుదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.అయితే కొత్తగా రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు చెప్పు తో నిరసన తెలిపుతున్నారు. ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యే ఈ కొత్త తరహా నిరసనకు నాందిపలికారు.

 

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక పదే పదే వాయిదా పడుతుండటంపై ప్రొద్దుటూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. అధికార పార్టీ నేతలు, అధికారాలు డ్రామాల వల్లే ఎన్నికల వాయిదా అనే డ్రామా జరుగుతోందని భావించిన ఆయన చెప్పుతో తనను తాను కొట్టుకుంటూ కొత్త తరహా నిరసన చేపట్టారు.

 

పట్టపగలు ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, టీడీపీ నేతల దౌర్జన్యానికి అధికారులు లొంగిపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను చేస్తోందని ధ్వజమెత్తారు. చైర్మన్‌ పదవికి కావాల్సిన మెజారిటీ వైఎస్‌ఆర్‌సీపీకి ఉండటంతో కావాలనే ఎన్నికను టీడీపీ వాయిదా వేయించిందని ఆయన ఆరోపించారు.

click me!