
కడప జిల్లా ప్రొద్దుటూరు ఎంఎల్ఏ రాచమల్లు ప్రసాద్ తన సభ్యత్వానాకి రాజీనామా చేసారు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూని అవుతున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రసాద్ ప్రకటించటం గమనార్హం. ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను నిబంధన ప్రకారం జరిపించటానికి అధికారులు కూడా సిద్ధపడకపోవటంతోనే మనస్తాపంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రసాద్ ప్రకటించారు. చంద్రబాబు సిఎంగా ఉన్నంత వరకూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేదన్నారు. ఇటువంటి పాలనతో తాను ఎంఎల్ఏగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నట్లు చెప్పారు.
చంద్రన్న పాలనలో టిడిపి ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. దేశం మార్కు ప్రజాస్వామ్యం ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ఇంత బరితెగింపా? పబ్లిక్ గా ఇంత దౌర్జన్యమా? తమ్ముళ్ళ ఆగడాలకు అంతు లేకుండా ఉంది. చివరకు పోలీసులు కూడా ప్రేక్షకులుగా మారిపోయారంటే తమ్ముళ్ళు ఎంత నిశ్శిగ్గుగా వ్యవహరిస్తున్నారో అర్ధమైపోతోంది. ఇదంతా కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారమే. శనివారమే జరగాల్సిన ఎన్నికలో కూడా రబస సృష్టించి వాయిదా వేయించారు. ఆదివారం కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. అధికారులకు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. ఆగమంటే ఎవరూ ఆగేట్లు లేరు.
ఛైర్మన్ సీట్లో కూర్చోవటానికి టిడిపికి అవసరమైన బలం లేదన్నది వాస్తవం. ఆ బలాన్ని సమీకరించుకోవటంలో నేతలు విఫలమయ్యారు. అందుకే శనివారం ఎన్నిక వాయిదా వేయించారు. అయినా వారికి సరిపడా బలం రాలేదు. మాజీ ఎంఎల్ఏ వరదరాజరల రెడ్డి మద్దతుదారుడు ఛైర్మన్ అవ్వటానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. 41 మంది కౌన్సిలర్లలో వైసీపీకి 19 మంది మద్దతుంది. మిగిలిన వారిలో రెండు వర్గాలున్నాయి. ఎన్నిక జరిగితే వైసీపీ కౌన్సిలర్ ముక్తియార్ ఛైర్మన్ గా గెలిచేందుకు అవకాశం ఉంది. దానికి తోడు మిగిలిన కౌన్సిలర్లలో ఏ వర్గమూ ఇంకో వర్గంతో కలవటం లేదు. దాంతో ఎన్నికంటూ జరిగితే వైసీపీ గెలుస్తుందన్న నమ్మకంతో చివరకు ఎన్నికనే అడ్డుకుంటున్నారు తమ్ముళ్ళు. అధికార పార్టీకి ఎంతటి సిగ్గుచేటో కదా?