నన్ను టార్గెట్ చేసి ఆరోపణలు, సంగతి చూస్తా: మాజీ మంత్రి బాలినేని సంచలనం

Published : Jun 27, 2022, 06:24 PM IST
నన్ను టార్గెట్ చేసి ఆరోపణలు, సంగతి చూస్తా: మాజీ మంత్రి బాలినేని సంచలనం

సారాంశం

వ్యక్తిగతంగా తనను కొందరు టార్గెట్ చేశారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసే వారితో తమ పార్టీ నేతలు కూడా టచ్ లో ఉన్నారని బాలినేని ఆరోపించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.   

ఒంగోలు: తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తనపై ఆరోపణలు చేసే వారితో తమ పార్టీ నేతలు కొందరు టచ్ లో ఉన్నారని  మాజీ మంత్రి ఆరోపించారు.  తాను తప్పు చేసినట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొంటానని కూడా ఆయన స్పష్టం చేశారు.

సోమవారం నాడు మాజీ మంత్రి Balineni Srinivas Reddy మీడియాతో మాట్లాడారు. తనను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నారు. Jana Sena  మహిళా నేత విషయంలో TDP  నేతల ప్రమేయం ఉందన్నారు. నా తప్పు ఉందని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. నాపై ఆరోపణలు చేసిన వారితో మా YCP నేతలు కూడా టచ్ లో ఉన్నారన్నారు. నాపై ఆరోపణలు ఎవరు చేస్తున్నారో తనకు బాగా తెలుసునన్నారు. వాళ్ల సంగతి చూస్తానని కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 

Chennai లో పట్టుబడ్డ డబ్బును తనకు ఆపాదిస్తున్నారన్నారు. తనపై జరుగుతున్న కుట్రపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేయాలని ఎస్పీని  కోరుతానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.పవన్ రిక్వెస్ట్ తోనే కేసులు ఉపసంహరించుకున్నామని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్