
ఏపి ప్రభుత్వంపై వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తాజాగా మరో కేసు వేసారు. ఇప్పటి వరకూ చంద్రబాబునాయుడుపైనే పోరాటం చేస్తున్న ఎంఎల్ఏ తాజా కేసులో స్పీకర్ పై కేసు వేయటం గమనార్హం. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కులను ఏకపక్షంగా అడ్వాన్స్ డ్ టెలికమ్యూనికేషన్స్ కు కట్టబెట్టారంటూ స్పీకర్ పై కేసు వేసారు. పిటీషన్ను పరిశీలించిన కోర్టు ప్రభుత్వానికి, టెలికమ్యూనికేషన్ సంస్ధకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించటం గమనార్హం.
అదే విషయమై ఆళ్ళ మీడియాతో మాట్లాడుతూ, టెండర్లు పిలవకుండానే నిబంధనలకు విరుద్ధంగా పై సంస్ధకు నామినేషన్ పద్దతిలో ఎలా ఇస్తారంటూ స్పీకర్ ను నిలదీసారు. టెలికం సంస్దకు హక్కులు ఇచ్చిన విషయమై తాను ఆర్టిఐ ద్వారా సమాచారం అడిగినట్లు చెప్పారు. 2018 చివరివరకూ నామినేషన్ పద్దతిలో పై కంపెనీకి స్పీకర్ హక్కులు కట్టబెట్టినట్లు సమాధానం వచ్చినట్లు తెలిపారు. ఒక కంపెనీకి తనిష్టం వచ్చినట్లుగా హక్కులు కట్టబెట్టే అధికారం స్పీకర్ కు లేదన్నారు. ఏం సంస్ధకు ప్రసారాల హక్కులు ఇవ్వాలన్నా టెండర్ల ద్వారా మాత్రమే ఇవ్వాలన్నారు.
అడ్వాన్స్ డ్ టెలికమ్యూనికేషన్ సంస్ధ వేమూరి రాధాకృష్ణ కొడుకు వేమూరి ఆదిత్యకు చెందిన సంస్ధ కాబట్టే స్పీకర్ నామినేషన్ పై హక్కులు ఇచ్చేసినట్లు ఆళ్ళ ఆరోపించారు. ఆ విషయాన్ని తాను సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందుంచినట్లు చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆళ్ళ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇప్పటికే వివిధ అంశాలపై సుమారు 40 కేసులు వేసారు. అన్నీ కూడా వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. కొన్ని కేసులు హై కోర్టులోనూ మరికొన్ని సుప్రింకోర్టులో ఉన్నాయ్.
మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM