
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పోలింగ్ కేంద్రం వద్ద వీరంగం సృష్టించారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించారు. నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సోము వీర్రాజు నేరుగా తొమ్మిదో డివిజన్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలతో ఆయన వాగ్వావాదానికి దిగారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.
మరిన్ని వార్తాల కోసం కింద క్లిక్ చేయండి