
చంద్రబాబునాయుడును వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ వదిలిపెట్టేట్లు కనబడటం లేదు. వివిధ స్ధాయిల్లోని వ్యక్తులపై ప్రభుత్వం ఉపసంహరించిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టులో కేసు వేసారు. ఆళ్ళ వేసిన కేసు ప్రకారం మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలపై వివిధ సందర్భాల్లో నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించిందట. వీరిపై నమోదైన కేసులకు సంబంధించి పలు కోర్టుల్లో జరుగుతున్న ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జివోలు జారీ చేసింది.
ఇపుడా జీవోలే రాజ్యాంగ విరుద్ధమంటూ ఎంఎల్ఏ కోర్టుకెక్కారు. తన కేసులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి, పలు జిల్లా కెలెక్టర్లు ప్రతివాదులుగా ఎంఎల్ఏ పేర్కొన్నారు. వీరితో పాటు స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉపముఖ్యమంత్రి కెఇ, మంత్రులు శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎంఎల్ఏలు నందమూరి బాలకుష్ణ, టివి రామారావు, చింతమనేని ప్రభాకర్, ఎ. ఆనందరావు, ఎం. అశోక్ రెడ్డి, దాసరి బాలవర్ధనరావు, దాట్ల సుబ్బరాజు, గొల్లపల్లి సూర్యారావు, ఎంల్సీలు కరణం బలరాం, రెడ్డి సుబ్రమణ్యంతో పాటు పలువురు మాజీ ఎంఎల్ఏలు ఇతర నేతలతో కలుపుకుని మొత్తం 274 మందిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు ఆళ్ల.