వైసీపీ ఎంఎల్ఏలు అలసిపోతున్నారు

First Published Sep 19, 2017, 12:50 PM IST
Highlights
  • పార్టీ మారే విషయంలో వివరణలు ఇచ్చుకోలేక వైసీపీ ఎంఎల్ఏలు అలసిపోతున్నారు.
  • నంద్యాల, కాకినాడ ఎన్నికలో టిడిపి గెలిచిన తర్వాత టిడిపి వైపు నుండి వైసీసీ ఎంఎల్ఏలపై  మైండ్ గేమ్ మరి ఉధృతంగా జరుగుతోంది.
  • ప్రతీ రోజూ ఒకరో ఇద్దరో ఎంఎల్ఏలను లక్ష్యంగా చేసుకోవటం త్వరలో వారు టిడిపిలోకి మారిపోతున్నారంటూ ఊదరగొట్టటం ఎక్కువైపోయింది.
  • ఒకవిధంగా వారిపై మానసికంగా వీక్ చేయటమో లేక హిప్నటైజ్  చేయటం లాంటిదే.

వైసీపీ ఎంఎల్ఏలు అలసిపోతున్నారు. ఏ విషయంలో అని అనుమానాలు వస్తున్నాయా? అదేనండి పార్టీ మారే విషయంలో వివరణలు ఇచ్చుకోలేక. నంద్యాల, కాకినాడ ఎన్నికలో టిడిపి గెలిచిన తర్వాత టిడిపి వైపు నుండి వైసీసీ ఎంఎల్ఏలపై  మైండ్ గేమ్ మరి ఉధృతంగా జరుగుతోంది. ప్రతీ రోజూ ఒకరో ఇద్దరో ఎంఎల్ఏలను లక్ష్యంగా చేసుకోవటం త్వరలో వారు టిడిపిలోకి మారిపోతున్నారంటూ ఊదరగొట్టటం ఎక్కువైపోయింది. ఒకవిధంగా వారిపై మానసికంగా వీక్ చేయటమో లేక హిప్నటైజ్  చేయటం లాంటిదే.

హోలు మొత్తం ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే రాజకీయంగా రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవటం, లేదా ఇబ్బందులు పెట్టుకోవటం సహజమే. కానీ టిడిపి నేతలకు మద్దతుగా ‘‘పచ్చ మీడియా’’ భుజానేసుకుని మరీ వైసీపీ ఎంఎల్ఏలపై బురద చల్లుతుండటం ఆశ్చర్యం.

జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన గడికోట శ్రీకాంత్ రెడ్డి త్వరలో టిడిపిలోకి మారుతున్నారంటూ ప్రచారం మొదలైంది. నంద్యాల ఉపఎన్నిక ఫలితాలు రాగానే 10 ఎంఎల్ఏలు ఓ హోటల్లో రహస్య సమావేశాలు జరిపినట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే ఇంతవరకూ ఎవరూ వైసీపీ నుండి బయటకు రాలేదు. విచిత్రమేమిటంటే మీడియాలో పేర్లు రాగానే వారే వచ్చి తాము పార్టీ మారటం లేదని చెబితే ఆ వివరణ మాత్రం పెద్దగా ఎక్కడా కనబడటం లేదు.

అంతుకుముందు రోజా కూడా వైసీపీని వదిలేస్తోందని జరిగిన ప్రచారం గుర్తుండే ఉంటుంది. తాజాగా మైదుకూరు వైసీపీ ఎంఎల్ఏ రఘురామిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం మొదలైంది. ఆయనేమో తాను పార్టీ మారటం లేదు మొర్రో అంటూ మొత్తుకుంటున్నారు. లోకేష్, కింజరాపు అచ్చెన్నాయడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆది నారాయణ రెడ్డి తదితరులు ప్రతీ రోజు ‘‘వైసీపీ ఎంఎల్ఏలు తమతో టచ్ లో ఉన్నార’’ని చెప్పటం ఓ మూడు రోజులు పచ్చ మీడియా దానిపై కథనాలు అచ్చేస్తుండటంతో వాటిని ఖండించలేక వైసీపీ ఎంఎల్ఏలు అలసిపోతున్నారు.

click me!