ఓటరు కార్డును ఆధార్ తో లింక్ చేయాలి..వైసీపీ డిమాండ్

Published : Dec 13, 2018, 12:33 PM IST
ఓటరు కార్డును ఆధార్ తో లింక్ చేయాలి..వైసీపీ డిమాండ్

సారాంశం

ప్రతి ఒక్కరి ఓటరు కార్డును ఆధార్ తో అనుసంధానం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ నేతలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని వారు మండిపడ్డారు. 

ప్రతి ఒక్కరి ఓటరు కార్డును ఆధార్ తో అనుసంధానం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ నేతలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని వారు మండిపడ్డారు. గురువారం పలువురు వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు.  ఈ సందర్భంగా ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

సర్వేల పేరుతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వైళ్లి వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని వారు కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఓటర్లు అందరికీ ఓట్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కమిషనర్ ను ఈ సందర్భంగా వారు కోరారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని కోరారు. ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. 

కమిషనర్ ని కలిసిన వారిలో ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, సీనియర్‌ నేతలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, వరప్రసాద్‌, మిథున్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్