కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు.. కుట్రలో భాగమని ఇప్పుడే తెలిసింది

By ramya neerukondaFirst Published Sep 8, 2018, 1:50 PM IST
Highlights

చంద్రబాబుకి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నిరంగులైనా మార్చగల సమర్ధుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీని పాతరేయాలి, తరిమేయాలి అన్న చంద్రబాబు ఈ రోజు పొత్తుపెట్టుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు.. కాంగ్రెస్ తో కలిసి వైసీపీ అధినేత జగన్ పై కుట్ర పన్నారని ఆ పార్టీ నేత పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో  ముందస్తు ఎన్నికల నేపథ్యంలో.. టీఆర్ఎస్ ని ధీటుగా ఎదురుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేత పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.

వీరిద్దరి పొత్తు చూస్తుంటే.. వైఎస్ చనిపోయిన తర్వాత.. జగన్ పై పెట్టిన కేసులన్నీ ఈ రెండు పార్టీల కుట్రలో భాగమేనని తనకు ఇప్పడే అర్థమౌతోందని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబుకి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నిరంగులైనా మార్చగల సమర్ధుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీని పాతరేయాలి, తరిమేయాలి అన్న చంద్రబాబు ఈ రోజు పొత్తుపెట్టుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

నోట్ల రద్దు నా వల్లే జరిగిందని అప్పుడు చెప్పి..మళ్లీ మాట మార్చారని వెల్లడించారు. కరవు నివారణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రెయిన్‌గన్స్‌తో లక్షల ఎకరాలు కాపాడామని చెబుతున్నారు..ఒక్క ఎకరమైనా సాగు జరిగిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు సిగ్గు లేకుండా కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు అంటున్నారు..అసెంబ్లీ దూషణలకు పరిమితం అవుతుంది..మేము ఎలా రావాలని ప్రశ్నించారు. ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి..రేపే అసెంబ్లీకి వస్తామని తెలిపారు.

చంద్రబాబు నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫిరాయింపులపై పుస్తకం రాశారు..మరి చంద్రబాబుకి ఎందుకు చెప్పరని సూటిగా అడిగారు. చంద్రబాబు చర్యలతో హరికృష్ణ, ఎన్టీఆర్‌ల ఆత్మ ఘోషిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మానసిక జబ్బుతో బాధపడుతున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవడం ఖాయమన్నారు.

click me!