నిరుద్యోగులకు శుభవార్త...46,290 ఉద్యోగాలపై ఆర్థిక మంత్రి ప్రకటన

By Arun Kumar PFirst Published 8, Sep 2018, 10:57 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అసెంబ్లీ సాక్షిగా ఓ శుభవార్త అందింది. అసెంబ్లీ లో ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ...ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు, వాటి భర్తీ ప్రక్రియ గురించి వివరించారు. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీచేస్తామంటూ నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించారు.

 ఏపిలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి దాదాపు 46,290 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయంటూ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే దాదాపు 2,350 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. 

Last Updated 9, Sep 2018, 1:32 PM IST