షాకింగ్ న్యూస్.. వైసీపీ నేత పెద్దారెడ్డి కి గుండెపోటు

By ramya neerukondaFirst Published Sep 8, 2018, 12:45 PM IST
Highlights

వైద్యులు పరిశీలించి ఆస్పత్రిలో ఐసీసీయూకు తరలించి మెరుగైన వైద్యమందిస్తున్నారు. ఆయితే పెద్దారెడ్డి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం గుత్తి సబ్‌ జైలులో గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సబ్‌ జైలు సిబ్బంది, గుత్తి పోలీసులు సమక్షంలో వైద్యచికిత్సల నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు పరిశీలించి ఆస్పత్రిలో ఐసీసీయూకు తరలించి మెరుగైన వైద్యమందిస్తున్నారు. ఆయితే పెద్దారెడ్డి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
 
అతనికి అప్పటికే బీపీ, షుగర్‌ ఉండటంతో ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలిసింది. కాగా.. ఆస్పత్రిలో ప్రత్యేక బలగాలచే భద్రత కల్పించారు. పెద్దారెడ్డిని చూసేందుకు వచ్చిన ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రయత్నంలో అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో ఇద్దరికి గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్‌ ఆయ్యరు. టూటౌన్‌ సీఐ ఆరోహణరావు సమస్యను సద్దుమనిగించారు.

click me!