డీఎస్పీ అక్రమ సంబంధం: పక్కోడి పెళ్లాన్ని, భూమిని కూడా లాక్కొన్నాడు

sivanagaprasad kodati |  
Published : Nov 30, 2018, 10:47 AM IST
డీఎస్పీ అక్రమ సంబంధం: పక్కోడి పెళ్లాన్ని, భూమిని కూడా లాక్కొన్నాడు

సారాంశం

ఇటీవలి తిరుపతిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వివాహితతో రాసలీలల్లో మునిగి తేలుతూ ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన డీఎస్పీ నాగ దుర్గాప్రసాద్ కేసులో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 


ఇటీవలి తిరుపతిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వివాహితతో రాసలీలల్లో మునిగి తేలుతూ ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన డీఎస్పీ నాగ దుర్గాప్రసాద్ కేసులో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు ఆమెను తన భార్యగా చెప్పి వివాహితను భూమిని సైతం అమ్మేశాడు.

దీనిపై హైదరాబాద్ నిజాంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివాహితతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తరువాత కనిపించకుండా పోయిన నాగ దుర్గా ప్రసాద్‌ను ఇవాళ బాచుపల్లి పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.

గుంటూరు జిల్లాలోని మంగళగిరి పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఓ డీఎస్పీ గతంలో హైదరాబాద్‌లో నివసించేవారు. తన ఇంటి పక్కనే నివసిస్తున్న ఒక వ్యక్తి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని టీటీడీలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని...తిరుపతి రావాల్సిందిగా అతడికి డీఎస్పీ చెప్పాడు.

ఉన్నతాధికారి కావడంతో అతని మాటలు నమ్మిన దంపతులు హైదరాబాద్ నుంచి తన నివాసాన్ని తిరుచానూరుకు మార్చారు.. ఇదే క్రమంలో అతని భార్యతో డీఎస్పీ సన్నిహితంగా మెలుగుతూ లోబరచుకున్నాడు.

ఆరు నెలలు ఎదురుచూసినా ఉద్యోగం రాకపోవడంతో అతను హైదరాబాద్ చేరుకుని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ పది రోజులకోసారి తిరుపతికి వచ్చేవాడు.  భర్త లేని సమయంలో డీఎస్పీ ఆమె దగ్గరకి వెళ్లేవాడు. వీరిద్దరి బంధాన్ని పసిగట్టిన భర్త అనేకసార్లు ఇద్దరినీ హెచ్చరించాడు. అయినా ఇద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు.

దీంతో ఆదివారం వివాహిత భర్త పక్కా సమాచారంతో కుటుంబసభ్యులు, పోలీస్ సిబ్బందితో కలిసి తన అపార్ట్‌మెంట్‌లో తన భార్, డీఎస్పీ ఇద్దరూ కలిసి వుండగా పట్టుకున్నారు. మీడియాతో పాటు పోలీసులను చూసిన డీఎస్పీ అక్కడి నుంచి పరుగులు తీసి పారిపోయాడు. 

వివాహితతో డీఎస్పీ రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

 

PREV
click me!

Recommended Stories

ఉగ్రవాదానికంటే ప్రమాదకరం YCP ఉన్మాదం: Kolusu Parthsarathy సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ | CM Chandrababu Inaugurates Quantum Reference Facility