తమ జీవితంలోకి మళ్లీ రావొద్దు చంద్రబాబు అంటూ పలు బ్యానర్లు కట్టడ గమనార్హం. రాజధాని రైతుల పేరిట ఆ బ్యానర్లు ఏర్పాటు చేయడం గమనార్హం. వైసీపీ నేతలే కావాలని ఇలా ఆందోళనలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరాతిలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజా వేదిక ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. అక్కడి నుంచి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాగా... పర్యటన మార్గంలో సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. మరోవైపు పలు చోట్ల నల్ల జెండాలతో ఆందోళన తెలిపారు. దీంతో రాయపూడి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
undefined
AlsoRead చంద్రబాబు అమరావతి పర్యటన... ఓవైపు స్వాగతం..మరోవైపు నిరసనలు...
ఈ పరిణామాలపై టీడీపీ నాయకులు, రాజధాని ప్రాంత రైతులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.... తమ జీవితంలోకి మళ్లీ రావొద్దు చంద్రబాబు అంటూ పలు బ్యానర్లు కట్టడ గమనార్హం. రాజధాని రైతుల పేరిట ఆ బ్యానర్లు ఏర్పాటు చేయడం గమనార్హం. వైసీపీ నేతలే కావాలని ఇలా ఆందోళనలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చేశారు. కృష్ణానది కరకట్ట నుంచి రాయపూడి వరకూ ఈ ఫ్లెక్సీల్లో చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు. క్షమాపణలు చెప్పిన తర్వాత ఇక్కడ అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజధాని పేరుతో రంగురంగుల గ్రాఫిక్స్ చూపించి మోసం చేశారని ఆరోపించారు. పేద, దళిత రైతుల భూములు సింగపూర్ ప్రైవేట్ సంస్థలకు ఎందుకు కట్టబెట్టారో చెప్పాలన్నారు. భూములు ఇవ్వని రైతులపై కేసులు పెట్టించి, పోలీసులతో హింసించారో చెప్పాలన్నారు.
ఇటు చంద్రబాబు పర్యటనపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా మండిపడ్డారు. ప్యాకేజీ పేరుతో దళిత సోదరులకు చేసిన మోసాన్ని ప్రపంచానికి చెప్పి.. బాబు పర్యటన కొనసాగించాలన్నారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమరావతిలో బాబు శంఖుస్థాపన చేసిన.. నిర్మాణం పూర్తి చేసుకున్న 100 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి. అమరావతి పర్యటన ప్రారంభించాలని డిమాండ్ చేశారు.