వైసీపీలో ధిక్కారం?: జగన్ ఆదేశాలు బేఖాతార్, మోదీని కలిసిన మరో ఎంపీ

By Nagaraju penumalaFirst Published Nov 27, 2019, 9:13 PM IST
Highlights

రఘురామకృష్ణంరాజు అంశంపై వైసీపీలో చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ రేపుతోంది. 

న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలను ఎంపీలు బేఖాతార్ చేస్తున్నారా..? విజయసాయిరెడ్డి లేకుండా కేంద్రమంత్రులను, ఇతర నేతలను కలవద్దని హెచ్చరించినా పలువురు ఎంపీలు ధిక్కారస్వరం వినిపిస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వెల్లువెత్తుతున్నాయి. 

శీతాకాల పార్లమెంట్ సమావేశాల ముందు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. 

అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కటి కావడంతో అంతా ఒకే బాటలో పయనించాలని సూచించారు. అందరూ ఐక్యంగా పోరాటం చేస్తే ఏదైనా సాధించవచ్చునని తెలిపారు. 

ఏ ఎంపీ కూడా తమ పరిధిధాటి ప్రవర్తించ వద్దని గట్టిగా హెచ్చరించారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి చెప్పకుండా ఢిల్లీలో ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టవద్దని ఎవర్నీ కలవద్దని కూడా గట్టిగా చెప్పారు. 

ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను విజయసాయిరెడ్డి అనుమతి లేకుండా కలవవద్దని హెచ్చరించారు. జగన్ హెచ్చరించిన మరుసటి రోజే ప్రధాని నరేంద్రమోదీ నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజును పలకరించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. 

ఢిల్లీ కేంద్రంగా వైసీపీలో కుదుపు: ఆ ఎంపీ వల్ల జగన్ కు టెన్షన్

వాస్తవానికి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు వెళ్లి కలవలేదు. అటుగా వెళ్తున్న ప్రధాని మోదీ ఎంపీ దగ్గరకు వచ్చి పలకరించారు. రాజుగారు బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆయన భుజం తట్టి వెళ్లిపోయారు. 

రఘురామకృష్ణంరాజు అంశంపై వైసీపీలో చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ రేపుతోంది. 

జగన్ ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మోదీని కలవడంపై వైసీపీలో చర్చ జరుగుతుంది. అయితే విజయసాయిరెడ్డి అనుమతితోనే ప్రధాని మోదీని కలిశారా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పడం లేదు. 

మరీ ఇంతలా కట్టడి చేస్తారా, చెప్పుకోలేకపోతున్నాం: జగన్ వద్ద ముగ్గురు మంత్రుల ఆవేదన
 
ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని కోరినట్లు మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. అలాగే పొగాకు బోర్డు సభ్యుల నియామకంలో స్థానికులకు అవకాశం ఇవ్వాలని మోదీని విజ్ఞప్తి చేశారు.

తాను రాష్ట్రం కోసం, నియోజకవర్గ సమస్యల కోసమే ప్రధానిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర సమస్యలు అయినా సరే వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి లేదా మిథున్ రెడ్డిలను వెంట ఎందుకు తీసుకెళ్లలేదని చర్చ జరుగుతుంది. మిగిలిన ఎంపీలను తీసుకెళ్లకుండా ఒంటరిగానే ఎందుకు కలవాల్సి వచ్చిందన్న అంశంపై చర్చ జరుగుతుంది. 

ఇకపోతే మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఇటీవల విజయసాయిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాహాటంగానే వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

బీజేపీ ఆఫీసులో వైసీపీ ఎంపీ.. ఏం జరుగుతోంది..?.

ఇకపోతే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మద్యపాన నిషేధం నిర్ణయం వల్ల మాగుంట శ్రీనివాసులరెడ్డి తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. వైసీపీ మధ్యపాన నిషేధంలో భాగంగా మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన బార్లు మూతవేయబడ్డాయని దాంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే మాగుంట శ్రీనివాసులరెడ్డి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నారు. అనూహ్యంగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైసీపీ తీర్థం పుచ్చుకుని ఒంగోలు లోక్ సభ టికెట్ సాధించారు. ఆ సీటు కోసం పోటీపడిన వైవీ సుబ్బారెడ్డి కేవలం టీటీడీ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. 

ర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రమంత్రులతో చర్చిస్తున్నారు. తాజగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి కేటీఆర్. ప్రస్తుత రాజకీయాలపై కాసేపు చర్చించారు.

మోదీని కలిస్తే తప్పా, అడక్కుండానే వివరణ ఇచ్చా: జగన్ తో భేటీపై ఎంపీ రఘురామకృష్ణంరాజు

click me!