కర్నూలు చేరుకున్న రాహుల్ గాంధీ.. సాయంత్రం భారీ బహిరంగసభ

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 1:44 PM IST
Highlights

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాయలసీమ గడ్డపై అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉన్న రాహుల్ ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు. 

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాయలసీమ గడ్డపై అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉన్న రాహుల్ ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్.. అక్కడి నుంచి మరో విమానంలో కర్నూలుకు వచ్చారు. అక్కడ రాహుల్‌‌కు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పెద్దపాడులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నివాసాన్ని సందర్శించి.. సంజీవయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు..

మధ్యాహ్నం బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి సమావేశం కానున్నారు. అనంతరం 2.45కి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి.. ఆయన నివాసాన్ని సందర్శిస్తారు..

సాయంత్రం 4 గంటకు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాహుల్ వెంట మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్ చాందీ, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నారు.

click me!