స్థానిక ఎన్నికలు: నామినేషన్ వెనక్కి తీసుకో.. లేదంటే, గిరిజన మహిళకు వైసీపీ నేత బెదిరింపులు, ఆడియో వైరల్

By Siva KodatiFirst Published Nov 5, 2021, 3:48 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా (east godavari) కాచవరం పంచాయతీ ఒకటో వార్డుకు నామినేషన్ వేసిన శిరీష (sirisha) అనే గిరిజన మహిళను చామంతుల వెంకన్న అనే వైసీపీ నేత ఫోన్ చేసి బెదిరించాడు. నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వెంకన్న ఆమెను హెచ్చరించాడు. టీడీపీనే కాదు.. ఏ పార్టీ తరఫునా నామినేషన్ వేయొద్దన్నాడు.
 

ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు (local body elections) జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అధికార వైసీపీ నేతలు విపక్షాలను నామినేషన్లు (nominations) వేయనీకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ (tdp) ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ వేస్తున్న ఓ గిరిజన మహిళకు బెదిరింపులు (waring) వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా (east godavari) కాచవరం పంచాయతీ ఒకటో వార్డుకు నామినేషన్ వేసిన శిరీష (sirisha) అనే గిరిజన మహిళను చామంతుల వెంకన్న అనే వైసీపీ నేత ఫోన్ చేసి బెదిరించాడు. 

నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వెంకన్న ఆమెను హెచ్చరించాడు. టీడీపీనే కాదు.. ఏ పార్టీ తరఫునా నామినేషన్ వేయొద్దన్నాడు. ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకుండా చేస్తామని సదరు వ్యక్తి హెచ్చరించాడు. ఆర్ అండ్ ఆర్ కు అర్హులు కారంటూ రిపోర్ట్ ఇప్పిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. జడ్పీటీసీని వెంటబెట్టుకుని వెళ్లి.. అసలు అక్కడ ఉండనే ఉండరని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎలా ఇస్తారని ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు.

తాను అల్లాటప్పా వ్యక్తిని కాదని, గ్రామంలో ఎవరుంటున్నారు? ఎవరుండట్లేదు? అన్న డేటా తన దగ్గర ఉంటుందని శిరీషను హెచ్చరించాడు. కాగా, ఈనెల 3న తాను నామినేషన్ వేశానని, తమ బంధువులకూ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని శిరీష ఆవేదన  వ్యక్తం చేశారు. తమకో చిన్నబాబున్నాడని, ప్రస్తుతం తాను గర్భవతినని, ఇప్పటికే ఎన్నో టెన్షన్ లున్నాయని, వైసీపీ నేతల బెదిరింపులతో టెన్షన్ మరింత ఎక్కువైందని ఆమె వాపోయారు. ప్రస్తుతం ఈ బెదిరింపులకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. 

ALso read:స్థానిక ఎన్నికలు.. కొందరు అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారు: ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జెడ్పీటీసీ, ఎంటీటీసీ  స్థానాలకు, పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.  ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం  నోటిఫికేషన్ జారీచేసింది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు, 533 పంచాయతీ వార్డులు, 69 సర్పంచ్‌ పదవులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే.. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక జరగనుంది.

అన్ని ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.  పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్‌, 18న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
 

click me!