విజయనగరం: భూములు వేలం వేసి.. బకాయిలు చెల్లిస్తాం, చెరకు రైతులకు బొత్స హామీ

By Siva Kodati  |  First Published Nov 5, 2021, 3:19 PM IST

విజయనగరం (vizianagaram) జిల్లా బొబ్బిలిలో (bobbili) చెరకు రైతుల ఆందోళనపై (sugarcane farmers protes) మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) స్పందించారు. చెరకు రైతులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లిస్తామని బొత్స హామీ ఇచ్చారు. 


విజయనగరం (vizianagaram) జిల్లా బొబ్బిలిలో (bobbili) చెరకు రైతుల ఆందోళనపై (sugarcane farmers protes) మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) స్పందించారు. చెరకు రైతులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లిస్తామని బొత్స హామీ ఇచ్చారు. ఎన్‌సీఎస్ షుగర్స్‌కు చెందిన 24 ఎకరాలను వేలం వేస్తామని.. ఆ సొమ్ముతో బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సత్యనారాయణ రైతులకు హితవు పలికారు. గంజాయిపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని.. పోలీస్ వ్యవస్థపై నిందలు వేయడం సరికాదని బొత్స స్పష్టం చేశారు. రాజధాని ఉద్యమం రైతులది కాదని.. టీడీపీదని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. 

కాగా.. ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం (ncs sugar factory) వద్ద బకాయిల కోసం ఆందోళన చేపడుతున్న రైతులకు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) మద్దతు ప్రకటించారు. మనకు తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నింపుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద రైతులు తమకు రావాల్సిన బకాయిల కోసం దాదాపు నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారని జనసేనాని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమస్య తీవ్రమైందని పవన్ ఆరోపించారు. 

Latest Videos

undefined

ALso Read:మనకి తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు.. విజయనగరం చక్కెర రైతులకు పవన్ బాసట

గత రెండేళ్ల నుంచి చెరకు రైతులకు రూ.16.38 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని పవన్ కల్యాణ్ వివరించారు. తమకు రావాల్సిన బకాయిల కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని పాలనా యంత్రాంగం శాంతిభద్రతల సమస్యగా చూడడం సరికాదని ఆయన హితవు పలికారు. రైతులను అరెస్ట్ చేయడం ద్వారా వారిలో ఆగ్రహాన్ని పెంచారని పవన్ దుయ్యబట్టారు. తక్షణమే బకాయిలు ఇప్పించాల్సిన సర్కారు, జనవరిలో చెల్లింపులు చేసేలా చక్కెర కర్మాగారం యాజమాన్యాన్ని ఒప్పిస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనని పవన్ విమర్శించారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు ఇప్పించే వెసులుబాటు ఉన్నా, ఈ చట్టాన్ని ప్రభుత్వం వినియోగించకపోవడంపై సందేహాలు కలుగుతున్నాయని పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు చెరకు బకాయి బిల్లులను చెల్లించాలని, ఎన్‌సిఎస్‌ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ... రైతు సంఘాలు నేడు బంద్‌, నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో... విజయనగరంలోని సిపిఎం, రైతు, చెరకు రైతు సంఘం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు.

click me!