నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికలో కనీసం అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి కూడా టిడిపికి లేదని నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
నెల్లూరు నగరం వైఎస్సార్సీపీకి అడ్డా అని మరోసారి నిరూపిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల పరిధిలోని 54 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని అనిల్ ధీమా వ్యక్తం చేసారు.
nellore municipal carporation ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసిపి తరపున పోటీచేస్తున్న వివిధ డివిజన్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో minister anil kumar yadav పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపక్ష టిడిపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
undefined
కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లలో అభ్యర్థులు పెట్టుకునే దిక్కు కూడా తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయిందని మంత్రి అనిల్ ఎద్దేవా చేసారు. తెలుగుదేశం పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరక్కపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులను నిలబెట్టుకోవడం చేతకావడం లేదున్నారు. 40వ డివిజన్ లో కనీసం ఆ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వడానికి ఒక్క మనిషి రాలేదని అనిల్ ఎద్దేవా చేసారు.
వీడియో
కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనైతిక పద్ధతులకు పాల్పడ్డాడనే మంత్రి ధ్వజమెత్తారు. సిపిఎంతో చర్చలు విఫలం అయ్యాయని... సీపీఐకి ఒక సీటు కేటాయించారని... మరోవైపు జనసేన తో చర్చలు జరపుతున్నారని అన్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయాలు ఉండవన్నారు.నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో మొత్తం 54 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి ఖాయమని మంత్రి అనిల్ దీమా వ్యక్తం చేసారు.
read more ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: నామినేషన్లకు నేడే చివరి రోజు, సమాచార సేకరణలో ఎస్ఈసీ
ఇప్పటికే ఏపీలోని అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయితీలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తయి పాలకవర్గాలు ఏర్పడ్డాయి. అయితే వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జెడ్పీటీసీ, ఎంటీటీసీ స్థానాలకు, పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది.
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు, 533 పంచాయతీ వార్డులు, 69 సర్పంచ్ పదవులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక జరగనుంది.
read more స్థానిక ఎన్నికలు.. కొందరు అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారు: ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు
అన్ని ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్, 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్, 18న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి జరిగిన.. స్థానిక సంస్థలు, కార్పొరేషన్‌ల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసింది. ప్రతిపక్ష టీడీపీ ఘోర పరాభావాన్ని మూటగట్టకుంది. అయితే తాజాగా మిగిలిన స్థానిక సంస్థలు, కార్పొరేషన్‌కు షెడ్యూల్‌లు విడుదలైన నేపథ్యంలో టీడీపీ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.