చంద్రబాబును కుటుంబమే బట్టలూడదీసి బజార్లో నిలబెడుతోంది..: సజ్జల రామకృష్ణారెడ్డి

By Arun Kumar PFirst Published Oct 18, 2023, 2:44 PM IST
Highlights

చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాల విషయంలో టిడిపి కాస్త సక్సెస్ అయ్యిందని... ఆయన అవినీతిపై చర్చ జరక్కుండా జాగ్రత్తపడ్డారని సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

అమరావతి : రాజమండ్రి సెంట్రల్ జైల్లోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, టిడిపి శ్రేణుల ఆందోళనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు అనేక పనుల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని.. అందువల్లే ఆయనను దర్యాప్తు సంస్థ సిఐడి అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబుపై ఎవరికీ రాజకీయ  కక్ష లేదని... అక్రమంగా ఇరికించలేదని అన్నారు. చంద్రబాబు ను ఆయన కుటుంబసభ్యులే బట్టలిప్పి బయట నిలబెడుతున్నారని సజ్జల అన్నారు. 

అయితే చంద్రబాబును కక్షతోనే అరెస్ట్ చేసారని... జైల్లో వున్న ఆయనతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని టిడిపి ప్రచారం చేస్తోందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబం, టీడీపీ కాస్త సక్సెస్ అయినట్లు కనిపిస్తోందని సజ్జల అన్నారు. సంపాదించడం కోసమే సీఎం అయినట్లు చంద్రబాబు వ్యవహరించారని...  చివరకు టిడిపి అధినేతగా కూడా కుంభకోణాలకు పాల్పడ్డారని అన్నారు. ఇప్పుడు ఆయన అవినీతి బాగోతాన్ని బయటపెడుతుంటే దానిపై చర్చ లేకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని సజ్జల అన్నారు. 

స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో రూ.240 కోట్లను చంద్రబాబు షెల్ కంపనీల ద్వారా దోచుకున్నాడని సజ్జల ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పాత్ర నేరుగా ఉందని ఆధారాలతో సహా బయటపడిందన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ వస్తే అంతా బయట పడుతుందన్నారు. 

Read More  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారంట్ పై స్టే నవంబర్ 7 వరకు పొడిగింపు

చంద్రబాబు తప్పు చేసినట్లు న్యాయస్థానాలు నమ్మాయి కాబట్టే జ్యుడీషియల్ కస్టడీకి పంపించారని సజ్జల అన్నారు. ఆయన బెయిల్ కోసం ప్రయత్నించినా లాభం  లేకపోవడంతో సింపథీ కోసం ప్రయత్నిస్తున్నారని... అందుకోసమే అనారోగ్యం అంటున్నారని అన్నారు. రాజమండ్రి జైలు వైద్య సిబ్బంది చంద్రబాబుకు ప్రతి రోజూ చెకప్ చేస్తున్నారని... హెల్త్ రిపోర్ట్స్ కోర్టుకు పంపిస్తున్నారని అన్నారు. రిమాండ్ లో ఉన్న ఖైదీ హెల్త్ రిపోర్ట్స్ రోజూ ఎందుకు ఇస్తారు?  అని సజ్జల అన్నారు.  

టిడిపి నాయకులు సాధారణ ప్రజాజీవితానికి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారని... అందువల్లే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని సజ్జల అన్నారు. అయినా 
భువనేశ్వరిని కలవడానికి వెళ్తే ఎందుకు అడ్డుకుంటాం... ఎక్కువమంది వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందనే అడ్డుకుంటున్నారని అన్నారు. దేశంలో ఎవరికీ లేని హక్కు దొంగల ముఠాకు ఎందుకు ఉంటుందంటూ సజ్జల మండిపడ్డారు. 

click me!