బ్రేకింగ్.. కరోనా అనుమానిత లక్షణాలతో వైసీపీ నేత మృతి

By telugu news teamFirst Published Jun 20, 2020, 11:05 AM IST
Highlights

ఇటీవల ముదిగుబ్బలో పంచాయతీ అద్దె భవనాలు వేలం పాటలో వైసీపీ నేత పాల్గొన్నారు. దీంతో వైసీపీ నేతతో కాంటాక్ట్ అయినట్లు గుర్తించిన వారందిరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

కరోనా అనుమానిత లక్షణాలతో ధర్మవరం వైసీపీ నేత మృతి చెందారు. నగరంలోని కోవిడ్ ఆస్పత్రిలో వారం రోజులుగా వైసీపీ నేత చికిత్స పొందుతున్నారు. కాగా అతడి పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌తో ధర్మవరం ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి చెందాడు. 

ఎమ్మెల్యే గన్‌మెన్ నుంచి వైసీపీ నేతకు కరోనా కాంటాక్ట్‌‌గా గుర్తించారు. ఇటీవల ముదిగుబ్బలో పంచాయతీ అద్దె భవనాలు వేలం పాటలో వైసీపీ నేత పాల్గొన్నారు. దీంతో వైసీపీ నేతతో కాంటాక్ట్ అయినట్లు గుర్తించిన వారందిరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా... ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 7,961 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. నిన్న ఒక్కరోజే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో కరోనా  సోకిన వారు 376 మంది.విదేశాల నుండి వచ్చినవారు 19 మంది, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు 70 మంది ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకటించింది.

24 గంటల వ్యవధిలో 82 మంది కరోనా నుండి కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.  కోవిడ్ తో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు మరణించినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 3065 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 3089 చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 96 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది.

విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చినవారిలో 308 మందికి కరోనా సోకింది. వీరిలో 261 యాక్టివ్ కేసులున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారిలో 1423 మందికి కరోనా సోకింది. వీరిలో 630 యాక్టివ్ కేసులున్నాయి.  వీరిలో ఇవాళ 51 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ తెలిపింది.
 

click me!