ఐదు రోజుల పనిదినాలు... ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల్లో ఉత్కంఠ

By Arun Kumar PFirst Published Jun 20, 2020, 10:55 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ పాలన అమరావతి నుండి సాగిస్తున్న నాటి నుంచి సచివాలయం, హెచ్ఓడిలలో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వెసలుబాట్లు కల్పిస్తున్న విషయం తెలిసిందే. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పాలన అమరావతి నుండి సాగిస్తున్న నాటి నుంచి సచివాలయం, హెచ్ఓడిలలో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వెసలుబాట్లు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగులకు వారానికి ఐదురోజుల మాత్రమే పనిచేసే వెసులుబాటు వుంది. ఈ నెల 27 వ తేదీతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియనున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో ఉత్కంఠ మొదలయ్యింది.

గతంలో చంద్రబాబు నాయుడు ఈ విధానాన్ని ప్రారంభించగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా దీన్ని కొనసాగించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఐదు రోజులు పనిదినాలు సంవత్సరం పొడిగించారు. ఆ గడువు పూర్తి కావడంతో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అని ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. 

వారానికి ఐదు పని దినాల విధానం కొనసాగించాలని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే శనివారం కూడా విధులకు హాజరు కావల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే తప్పక పాటిస్తామంటున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగుల్లోనే కాదు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

read more  బ్రేకింగ్.. కరోనా అనుమానిత లక్షణాలతో వైసీపీ నేత మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో  పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు కోవిడ్ 19 సోకడం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.ఇప్పటి వరకు 10 మంది సెక్రటేరియేట్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఛాంబర్ ఉండే ఫస్ట్ బ్లాక్‌లో జీఏడీ ఉద్యోగికి, ఆర్‌టీజీఎస్‌ ఉద్యోగికి కరోనా సోకింది.

సచివాలయంలో పనిచేసే వ్యవసాయ, సహకార శాఖల ఉద్యోగులకు ఇప్పటికే  వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించారు పూనం మాలకొండయ్య. అలాగే పరిశ్రమల శాఖ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. కాగా సచివాలయ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాలని సీఎస్ నీలం సాహ్నికి ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి సమయంలో ఐదు రోజుల పనిదినాలను పొడిగిస్తే కరోనా మరింత విజృంభించే అవకాశాలున్నాయని సచివాలయ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 

 

click me!