కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో నరికి ... హిందూపురంలో వైసిపి నేత దారుణ హత్య

Published : Oct 09, 2022, 07:58 AM ISTUpdated : Oct 09, 2022, 08:20 AM IST
కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో నరికి ... హిందూపురంలో వైసిపి నేత దారుణ హత్య

సారాంశం

అధికార వైసిపి నాయకుడి దారుణ హత్య హిందూపురంలో కలకలం రేపింది, శనివారం రాత్రి ఇంటిముందే వైసిపి నేత కళ్లలో కారంపొడి చల్లి విచక్షణాారహితంగా నరికి చంపారు దుండుగులు. 

హిందూపురం : అధికార వైసిపి నాయకుడి దారుణ హత్య సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో నరికి అతి కిరాతకంగా చంపారు దుండగులు. అయితే ఈ దారుణం వెనక హిందూపురం వైసిపి నాయకులు, స్థానిక పోలీసుల హస్తం వుందని మృతుడి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఆరోపిస్తున్నారు.  

వివరాల్లోకి వెళితే... హిందూపురం నియోజకవర్గ  వైసిపి సమన్వయకర్తగా గతంలో చౌళూరు రామకృష్ణారెడ్డి(46) పనిచేసారు. స్థానిక ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులతో విబేధాల కారణంగా అతడు పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు. ఈ విబేధాలే అతడి హత్యకు కారణమయ్యాయని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. 

స్వగ్రామం చౌళూరుకు సమీపంలోనే కర్ణాటక సరిహద్దులో రామకృష్ణారెడ్డి ఓ దాబాను నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం దాబాకు వెళ్లిన అతడు రాత్రివరకు అక్కడే వున్నాడు. దాబా మూసేవరకు అక్కడే వుండి రాత్రి 9గంటలకు కారులో ఇంటికి బయలుదేరాడు. అయితే అతడి కోసం ఇంటి సమీపంలోనే కాచుకుని కూర్చున్న దుండగులు కారు దిగగానే ఒక్కసారిగా దాడికి దిగారు. రెండు బైక్ లపై ముఖానికి మాస్కులు ధరించి వచ్చిన దుండగులు రామకృష్ణారెడ్డి కళ్లలో కారం చల్లి కత్తులతో దాడిచేసారు. విచక్షణారహితంగా కత్తులతో నరకడంతో అతడు అక్కడే రక్తపుమడుగులో కుప్పకూలాడు. 

తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డి చనిపోయాడని భావించిన దుండగులు అక్కడినుండి పరారయ్యారు. అయితే అతడు ప్రాణాలతో వుండటాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు కారులో హాస్పిటల్ కు తరలించారు. కానీ మార్గమధ్యలోనే రామక‌ృష్ణా రెడ్డి మృతిచెందాడు. అతడి మృతదేహంపై 18 కత్తిపోట్లు వున్నట్లు గుర్తించారు.  

Read more  కాకినాడ జిల్లాలో దారుణం.. యువతి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది..

మృతుడు రామక‌ృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మనవడు. రాజకీయ నేపథ్యమున్న అతడు హిందూపురం వైసిపిలో కీలక నాయకుడు. అయితే ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులతో రామకృష్ణా రెడ్డికి వివాదం చోటుచేసుకుంది. అలాగే ఎమ్మెల్సీ పీఏపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాదు స్థానిక సీఐ జీటి నాయుడుపై జాతీయ బాలల హక్కుల సంఘానికి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసారు. ఈ వివాదాలే అతడి హత్యకు దారితీసిందని అనుమానిస్తున్నారు. 

తన కొడుకు దారుణ హత్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన పీఏ గోపీకృష్ణ, చౌళూరి రవికమార్, హిందూపురం రూరల్ సీఐ జిటి నాయుడు లే కారణమని రామకృష్ణారెడ్డి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఆరోపిస్తున్నారు. వీరి అక్రమాలను బయటపెడుతున్నాడనే కొడుకును పొట్టనపెట్టుకున్నాడని ఆమె కన్నీరుమున్నీరవుతూ తెలిపారు.

రామకృష్ఱారెడ్డి హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్లోనే వుంచారు. ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు