ఆమంచిపై వైసీపీ నేత సంచలన ఆరోపణలు

Published : Feb 20, 2019, 12:47 PM IST
ఆమంచిపై వైసీపీ నేత సంచలన ఆరోపణలు

సారాంశం

టీడీపీ నుంచి ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణ మోహన్ పై చీరాల వైసీపీ నేత బాలాజీ సంచలన ఆరోపణలు చేశారు.

టీడీపీ నుంచి ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణ మోహన్ పై చీరాల వైసీపీ నేత బాలాజీ సంచలన ఆరోపణలు చేశారు. ఆమంచి పార్టీలో చేరిన విషయంపై బాలాజీ.. జగన్ కి బహిరంగ లేఖ రాశారు.

జగన్ ఓదార్పు యాత్ర సమయంలో ఆమంచి ఆగడాలు తట్టుకోలేక తనను పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. ఎన్ఆర్ఐ అయిన తాను 9ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేశానని చెప్పారు. ఆమంచి లాంటి రౌడీని పార్టీలో చేర్చుకోవద్దని కోరినా.. జగన్ వినలేదన్నారు. జగన్ అవినీతి కూడా నిజమనే భావన కలుగుతోందని, తన లేఖపై స్పందించకుంటే వైసీపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తానని యడం‌ బాలాజీ  హెచ్చరించారు.

మరోవైపు బాలాజీ..టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బాలాజీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!