ఆస్తి కోసం.. భర్తపై వేడినీళ్లు పోసిన భార్య

Published : Feb 20, 2019, 11:57 AM IST
ఆస్తి కోసం.. భర్తపై వేడినీళ్లు పోసిన భార్య

సారాంశం

ఆస్తి కోసం కట్టుకున్న భర్తపై ఓ మహిళ వేడివేడి మసిలే నీటిని పోసింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

ఆస్తి కోసం కట్టుకున్న భర్తపై ఓ మహిళ వేడివేడి మసిలే నీటిని పోసింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  విజయవాడ అయోధ్యనగర్ కి చెందిన అట్టూరి వెంకట రమణ(49) హైదరాబాద్ లో భవన నిర్మాణ పనులు చేస్తుంటాడు.

వెంకట రమణకు 18ఏళ్ల క్రితం హేమలతతో వివాహమైంది. హేమలత.. నగరపాలక సంస్థ పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. గత కొంతకాలంగా భార్య, భర్తల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.

భర్తపేరిట ఉన్న ఆస్తిని.. తన పేరిట, పిల్లల పేరిట రాయాల్సిందిగా హేమలత కొంతకాలంగా వెంకట రమణను వేధించడం మొదలుపెట్టింది. అతను నిరాకరించడంతో.. భర్తపై వేడి వేడీ మసిలే నీటిని మీద పోసేసింది. దీంతో.. అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!